Kavya Maran : సన్ రైజర్స్ రాత మారడం లేదు. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ 15వ సీజన్ లో ఆ జట్టు ఆడడం లేదు.
దయానిధి మారన్ జట్టును తీసుకున్నాక ఆ జట్టుకు సిఇఓగా కావ్య మారన్ (Kavya Maran)బాధ్యతలు చేపట్టారు.
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో జరిగిన మెగా వేలంలో భారీ ధరకు ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
కానీ వర్కవుట్ కావడం లేదు. ప్రధానంగా ఊహించని రీతిలో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను తీసుకుంది.
గత సీజన్ లో ఆసిస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ను అనూహ్యంగా తప్పించింది. కెప్టెన్సీ నుంచి చివరకు జట్టు నుంచి అమానవీయంగా తప్పించింది.
దానికి గల కారణాలు బయటకు చెప్పలేదు సన్ రైజర్స్(Kavya Maran ) మేనేజ్ మెంట్ . ఇదిలా ఉండగా దుబాయి వేదికగా జరిగిన టీ20 టోర్నీలో వార్నర్ భయ్యా అద్భుతంగా ఆడాడు.
సెమీస్ నుంచి ఫైనల్ దాకా ఆ జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా కప్ గెల్చు కోవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు.
ఇదే సమయంలో డేవిడ్ వార్నర్ ను వేలం పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తీసుకుంది.
ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ కు అప్పగించింది.
అయినా సేమ్ సీన్. రాజస్తాన్ తో 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి దాకా వచ్చి పరాజయం పాలైంది. 12 పరుగల తేడాతో ఓటమి చవి చూసింది.
కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
లోపం జట్టులో లేదని ఉన్నదంతా మేనేజ్ మెంట్ లో ఉందన్నాడు. ప్రస్తుతం జట్టు ఆట తీరుపై కావ్య మారన్(Kavya Maran) నెత్తి పట్టుకుంది.
ఏం చేయాలో తెలియక తనలో తాను తిట్టుకుంటోంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో కావ్య మారన్ తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read : జన బాంధవుడు జగ్జీవన్ రాం