Kavya Maran : హ‌మ్మ‌య్య ‘ముద్దుగుమ్మ’ న‌వ్వింది

కేకేఆర్ పై విజ‌యంతో హ‌ల్ చ‌ల్

Kavya Maran : ఐపీఎల్ కు ఉన్నంత క్రేజ్ ఇంకే దానికి లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫుట్ బాల్ కు క్రేజ్ ఉండేది. కానీ దానిని దాటేసింది ధ‌ర‌ల ప‌రంగా, ఆద‌ర‌ణ ప‌రంగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్. ఈ ఒక్క ఆట ద్వారా వేల కోట్ల రూపాయ‌లు బీసీసీఐకి ద‌క్కుతున్నాయి.

ఇక ఇది ప‌క్క‌న పెడితే ఐపీఎల్ అంటే ఆటే కాదు అందం కూడా. అంద‌మైన ముద్దుగుమ్మ‌ల‌కు వేదిక‌గా ఇది మారింది. అన్ని మ్యాచ్ లు ఒక ఎత్తు.

పంజాబ్ కింగ్స్ కు స‌హ య‌జ‌మానిగా ఉన్న ప్రీతి జింతా ఉండ‌గా ప్ర‌స్తుతం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా సిఇఓగా ఉన్న కావ్య మార‌న్(Kavya Maran) ఇప్పుడు హాట్ టాపిక్.

ఆమె ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ను తీసుకుందో కెమెరాల క‌ళ్ల‌న్నీ ఆమె వైపే ఉంటున్నాయి. ఎందుకంటే మ‌న‌సు తిప్పు కోలేని, క‌ళ్లు ఆర్ప‌లేని అందం. ఇంకేం ఆమె స్టేడియంలో ఉందంటే ఆట‌గాళ్ల కంటే, ఆట కంటే ఆమె వైపు ల‌క్ష‌లాది క‌ళ్లు చూస్తుంటాయి.

ఇక కెమ‌రాల‌న్నీ కావ్య మార‌న్ వైపు ఫోక‌స్ పెడుతుంటాయి. ఈ త‌రుణంలో స్టార్టింగ్ లో ఓట‌మి మూట‌గ‌ట్టుకున్న స‌న్ రైజ‌ర్స్ మెల్ల‌గా గాడిలో ప‌డింది.

తాజాగా ఐపీఎల్ 2022లో రిచ్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చుక్క‌లు చూపించింది హైద‌రాబాద్. కేవ‌లం మూడు వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

దీంతో ఆనందం ప‌ట్ట‌లేక ఐపీఎల్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జెండా ప‌ట్టుకుని ఊపుతూ సంతోషం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం మీడియా అంతా కావ్య మార‌న్(Kavya Maran) ను హైలెట్ చేస్తూ రావ‌డం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి.

Also Read : ఎయిడెన్‌ మార్క్రమ్ ధ‌నా ధ‌న్

Leave A Reply

Your Email Id will not be published!