Kavya Maran : అందం చూడవయా ఆనందించవయా అని సినీ కవి ఊరికే రాయలేదు. ఆయన కూడా ఆ అందాన్ని చూసి తరించమన్నాడు. ఇక ఆటకు అందానికి చాలా దగ్గరి అనుబంధం ఉంది.
ఈ ఐపీఎల్ లో ఎందరో ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఒకే ఒక్కరు మాత్రం నేషనల్ క్రష్ గా మారారు. ఆమె ఎవరో కాదు భారతీయ కుబేరులలో ఒకడిగా పేరొందిన కళానిధి మారన్ కూతురు కావ్య మారన్.
గతంలో ఆమె ఎవరో తెలిసింది కొద్ది మందికి మాత్రమే. కానీ ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ను సన్ గ్రూప్ తీసుకుందో ఆనాటి నుంచీ కావ్య మారన్(Kavya Maran) హాట్ టాపిక్ గా మారారు.
ఆ జట్టు మేనేజ్ మెంట్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ గా మారారు. నెట్టింట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెతికిన పేరు ఎవరంటే కావ్య మారన్ కావడం విశేషం.
వేలం పాటలోనే కాదు ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో సైతం కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమెకు క్రికెటర్లతో పాటుగా అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.
కావ్య మారన్ మైదానంలోకి వచ్చిందంటే చాలు వందలాది కెమెరాలు, మొబైల్స్ అన్నీ ఆమె వైపు ఫోకస్ పెట్టి ఉంటాయి. ఇప్పుడు వేలాది ఫోటోలు నెట్టింట్లో హల్ చేస్తున్నాయి.
ఈ అమ్మడు ఈసారి ఫుల్ జోష్ లో ఉంది. ఎందుకంటే తాను తీసుకున్న ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. వాటిని బేఖాతర్ చేస్తూ కంటిన్యూ చేసింది.
తను ఎవరినైతే తీసుకుందో వాళ్లంతా ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు. ఊహించని రీతిలో సన్ రైజర్స్ రైజింగ్ లో ఉంది. దీంతో ఈ ముద్దుగుమ్మ పెదవుల మీ దరహాసం వెళ్లి విరుస్తోంది.
Also Read : కథ కంచికి ముంబై ఇక ఇంటికే