KCR : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన జీవో 111 ను ఎత్తి వేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్(KCR )వెల్లడించారు.
మంగళవారం మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం సీఎం ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడారు. తన అధ్యక్షతన జరిగిన కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు కేసీఆర్.
6 ప్రైవేట్ యూనివర్శిటీలకు ఆమోదం తెలిపామన్నారు. ఆయా యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం.
మే 20 నుంచి జూన్ 5 దాకా పల్లె, పట్టణ ప్రగతిని చేపడతామన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కేసీఆర్(KCR ). కామన్ బోర్డు ద్వారా మూడున్నర వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెండు అదనపు టెర్మినళ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో గణనీయంగా సాగు మెరుగు పడిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సాగు జరిగిందన్నారు కేసీఆర్. కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు కేసీఆర్. రాష్ట్రంలో కోటికి పైగా విస్తీర్ణం పెరిగిందన్నారు.
11 నెలల పాటు రైతులు చేసిన ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చిందన్నారు. రాష్ట్రాలను దివాళా తీయించేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. కేంద్రం తన బాధ్యతను గుర్తించాలనే తాము ఢిల్లీలో ధర్నా చేపట్టామన్నారు కేసీఆర్.
వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఎరువుల ధరలు కూడా పెంచాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Also Read : వరి దీక్ష పేరుతో కేసీఆర్ డ్రామా