Kerala CM : కేరళ గవర్నర్ ఖాన్ పై సీఎం కన్నెర్ర
మితిమీరిన జోక్యం మంచిది కాదు
Kerala CM : కేరళలో గవర్నర్, సీఎం మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్శిటీల వీసీలు వెంటనే రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి నవంబర్ 3 డెడ్ లైన్ విధించారు. దీనిని సవాల్ చేస్తూ వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా వీసీల ఎంపికలో యూజీసీ రూల్స్ పాటించలేదంటూ వీసీలు వెంటనే రాజీనామా చేయాలని గగవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనిపై సీఎం పినరయి విజయస్ స్పందించారు. గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
వీసీలను యూజీసీ రూల్స్ ప్రకారం ఎంపిక చేయఢం జరిగిందన్నారు. ఎక్కడా అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదన్నారు. వీసీలను తొలగించే అధికారం గవర్నర్ కు లేదన్నారు. ఈ మేరకు ఏ ఒక్క వీసీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం గవర్నర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
గవర్నర్ ప్రభుత్వానికి సహకరించాలని, ఇబ్బంది పెట్టాలని చూడ కూడదన్నారు. రాజ్యాంగానికి సేఫ్ గార్డ్ గా ఉండాలే తప్ప కేంద్రానికి గులాం కాకూడదన్నారు సీఎం(Kerala CM). రాష్ట్రంలోని యూనివర్శిటీలను నాశనం చేయాలని గవర్నర్ కంకణం కట్టుకున్నారంటూ ఆరోపించారు. రాజ్యాంగ పరిధి దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా వీసీలు దాఖలు చేసిన పిటిషన్ ను కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ విచారించారు. వీసీలను నియమించింది గవర్నరేనని వారి నియామకాలు తప్పైతే ముందు గవర్నర్ పై చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.
Also Read : కేరళ గవర్నర్ తీరుపై సీఎం సీరియస్