Ketaki Chitale : పవార్ పై కేతకి చితాలే షాకింగ్ కామెంట్స్
ఎన్సీపీ చీఫ్ ఒక మతం కాదన్న నటి
Ketaki Chitale : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) పై అభ్యంతరకరమైన పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో ఆనాటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నటి కేతకి చితాలేను వేధింపులకు గురి చేసింది. ఆపై అరెస్ట్ చేసింది. ఇటవలే ఆమె జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ సందర్భంగా కాలం సమాధానం చెబుతుందని, అంతగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే వాస్తవం ఏమిటనే దానిపై తాను మాట్లాడతానని ప్రకటించారు.
సోమవారం కేతకి చితాలే ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడారు. సంచలన కామెంట్స్ చేశారు శరద్ పవార్ పై. శరద్ పవార్ అందరి లాంటి వ్యక్తి. ఆయన నాయకుడు కావచ్చు.
అయినంత మాత్రాన ఆయనే ఏం దేవుడు కాదు అంతకన్నా గుర్తుంచు కోవాల్సిన మతం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి కేతకి చితాలే.
ఈ మొత్తం వ్యవహారంలో నన్ను ఇరికించేందుకు ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. వారికంటూ ఓ 20 నుంచి 25 మంది గ్రూపు ఉంది. వారు నన్ను వేధింపులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేతకి చితాలే(Ketaki Chitale).
ఆపై దాడికి కూడా పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనపై విషపూరిత రంగు చల్లారంటూ ధ్వజమెత్తారు. ఫేస్ బుక్ నుండి ఒక పోస్ట్ ను కాపీ పేస్ట్ చేసి తన ప్రొఫైల్ లో అప్ లోడ్ చేసినందుకు తనను జైలులో పెట్టారంటూ వాపోయారు కేతకి చితాలే.
సిరా చల్లారు, గుడ్లు విసిరారు. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో మొత్తం 22 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. మే 14న అరెస్ట్ చేశారు. జూన్ 24న బెయిల్ మంజూరు చేశారు.
Also Read : షిండే సర్కార్ బన్ గయా షాన్ దార్