Kevin Pietersen : రోహిత్ శ‌ర్మ అయితే బెట‌ర్

కెవిన్ పీట‌ర్స‌న్ కీల‌క కామెంట్స్

Kevin Pietersen : ఇంగ్లండ్ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ గా కోహ్లి త‌ప్పు కోవ‌డంతో తాజా, మాజీ ఆట‌గాళ్లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే గ‌వాస్క‌ర్, మంజ్రేక‌ర్, గంభీర్, దానిష్ క‌నేరియా, ర‌షీద్ ల‌తీఫ్, షాహిదీ అఫ్రిదీ, అలెన్ డొనాల్డ్ , త‌దిత‌ర ఆటగాళ్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఈ త‌రుణంలో పీట‌ర్స‌న్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

కోహ్లీ ప్లేస్ ను రోహిత్ శ‌ర్మ భ‌ర్తీ చేయ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు. కేఎల్ రాహుల్ కంటే రోహిత్ బెట‌ర్ చాయిస్ అని పేర్కొన్నాడు పీట‌ర్స‌న్(Kevin Pietersen). భార‌త టెస్టు త‌దుప‌రి స్కిప్ప‌ర్ ఎవ‌రు అన్న చ‌ర్చ విప‌రీతంగా న‌డుస్తోంది క్రికెట్ వ‌ర్గాల‌లో.

ఇప్ప‌టికే బీసీసీఐ రోహిత్ శ‌ర్మ‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది. అయితే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో స‌ఫారీ టూర్ కు దూర‌మ‌య్యాడు.

రోహిత్ శ‌ర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది. అయితే కోహ్లీ ఉన్న‌ట్టుండి సౌతాఫ్రికాతో టెస్టు సీరీస్ ఓడి పోయిన వెంట‌నే త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు రోహిత్ శ‌ర్మ‌లో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కితాబు ఇచ్చాడు. అత‌డి కెప్టెన్సీలోనే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు ముంబై ఇండియ‌న్స్ కు తీసుకు వ‌చ్చేలా చేశాడ‌న్నాడు.

కోహ్లీది వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని దాని గురించి ఆలోచించాల్సిన ప‌ని లేద‌న్నాడు పీట‌ర్స‌న్(Kevin Pietersen). ఇదిలా ఉండ‌గా ఓమ‌న్ వేదిక‌గా లివింగ్ లెజెండ్స్ లీగ్ నిర్వ‌హించ‌డాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు కెవిన్ పీట‌ర్స‌న్.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!