Kiccha Sudeep : కర్ణాటక బ్రాండ్ అంబాసిడర్ గా సుదీప్
నియమించిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం
Kiccha Sudeep : కర్ణాటక ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. సర్కార్ కొత్తగా పుణ్యకోటి దత్తు యోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పశువుల దత్తత పథకానికి రాయబారిగా ఎంపిక చేసింది. కన్నడ స్టార్ సుదీప్(Kiccha Sudeep) ను నియమించింది. పశు సంవర్ధక శాఖ పుణ్యకోటి పశువుల దత్తత పథకాన్ని ప్రచారం చేసేందుకు కిచ్చా సుదీప్ కు చాన్స్ ఇచ్చింది.
సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా పశు సంవర్దక శాఖ మంత్రి ప్రభు బి. చవాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గో సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు తమ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
పుణ్యకోటి పశువుల దత్తత పథకాన్ని ప్రచారం చేయాలని సంకల్పించింది. ఇందుకు సీఎం బొమ్మై కూడా ఓకే చెప్పారు. ఎందుకంటే రోజు రోజుకు వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.
ఇందుకు కిచ్చా సుదీప్ అసలైన వ్యక్తిగా తాము గుర్తించామని తెలిపారు మంత్రి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. తాము అడిగిన వెంటనే కిచ్చా సుదీప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సమ్మతించారని వెల్లడించారు.
ఈ సందర్భంగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇదిలా ఉండగా తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై(CM Bommai) కి, పశు సంవర్దక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కిచ్చా సుదీప్.
Also Read : పప్పీ తో కీర్తి సురేష్ అల్లరి ఫోజులు