Kiren Rijiju & Udit Narayan : ఉదిత్ గాత్రానికి కిరెన్ రిజిజు ఫిదా

కేంద్ర మంత్రిని క‌లిసిన గ్రేట్ సింగ‌ర్

Kiren Rijiju & Udit Narayan : ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సంగీతం అన్నా, పాట‌లు విన‌డం అంటే చ‌చ్చేంత ఇష్టం. మ‌రి త‌ను ఆనందించే పాట‌ల్ని పాడిన సింగ‌ర్ త‌న‌ను క‌లిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్ప‌లేం.

ఇదే సంతోషాన్ని పంచుకున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju). మ‌రి మంత్రిని ఫిదా చేసిన ఆ గాయ‌కుడు ఎవ‌రో కాదు. ప‌లు భాష‌ల్లో వేల పాట‌లు పాడుతూ అల‌రిస్తూ వ‌చ్చిన ఉదిత్ నారాయ‌ణ్.

అనుకోకుండా మంత్రిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఎన్నో విష‌యాల‌ను, సినిమాల‌కు సంబంధించి, అద్బుత‌మైన పాట‌ల గురించి అల‌వోక‌గా చెపుతూ వెళ్లారు కేంద్ర మంత్రి.

దీంతో విస్తు పోవ‌డం ఉదిత్ నార‌య‌ణ్ వంతైంది. తాను పాడిన పాట‌ల‌ను ఆయ‌న జాబితా వారీగా చెబుతూ పోయారు. ఈ సంద‌ర్బంగా ఐసా దేస్ హై మేరా మంత్రి కోసం పాడారు.

ఉదిత్ నారాయ‌ణ్ కు వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న ఆహ్తాద‌క‌ర‌మైన స్వ‌రానికి ఎవ‌రైనా ముగ్ధుల‌వ‌డం ఖాయం. ఈ సంద‌ర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా బాలీవుడ్ గాయ‌కుడి స్వ‌ర మాధుర్యాన్ని ఆస్వాదించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ఉదిత్ నారాయ‌ణ్( Udit Narayan) ను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు మంత్రి. ఒక త‌రం మొత్తం అత‌డి శ్రావ్య‌మైన పాట‌ల‌ను విన్న‌ది.

ఉదిత్ జీ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. చాలా ఆనందం క‌లిగింద‌న్నారు కిరెన్ రిజిజు.

Also Read : యూట్యూబ్ స్ట్రీమింగ్ వీడియో స‌ర్వీస్

Leave A Reply

Your Email Id will not be published!