Kiren Rijiju : స్వ‌లింగ వివాహాల‌పై రిజిజు కామెంట్స్

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

Kiren Rijiju Same Gender Marriage : స్వ‌లింగ వివాహాలకు సంబంధించిన కేసు విచార‌ణ సుప్రీంకోర్టులో జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju Same Gender Marriage). తాను వ్య‌క్తిగ‌త జీవితాల్లో జోక్యం చేసుకోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అన‌వ‌స‌ర విష‌యాలపై త‌న‌ను లాగ‌వ‌ద్ద‌ని కోరారు. పౌరుల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, వ్య‌క్తిగ‌త కార్యక‌లాపాలు ఎప్పుడూ భంగం క‌లిగించ‌ద‌ని పేర్కొన్నారు కిరెన్ రిజిజు.

స్వ‌లింగ వివాహాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని, వైఖ‌రిని ఆయ‌న స‌మ‌ర్థించారు. వీటికి ఆమోదం తెలిపితే వివాహ వ్య‌వస్థ దెబ్బ తింటుంద‌ని పేర్కొంది కేంద్రం. ఇది పూర్తిగా దేశ ప‌రువుకు భంగం క‌లుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానానికి ఈ మేర‌కు విన్న‌వించింది.

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల చ‌ట్ట బ‌ద్ద‌మైన ధృవీక‌ర‌ణ‌ను సుప్రీంకోర్టులో కేంద్రం వ్య‌తిరేకించిన ఒక రోజు త‌ర్వాత స్పందించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం వ్య‌క్తుల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, కార్య‌క‌లాపాల‌కు భంగం క‌లిగించ‌దు. కానీ సంస్థ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ను స‌పోర్ట్ చేయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు కిరెన్ రిజిజు. వివాహం విధానానికి సంబంధించిన అంశ‌మ‌ని పేర్కొన్నారు.

పౌరుల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, వ్య‌క్తిగ‌త కార్య‌క‌లాపాలు ప్ర‌భుత్వం అడ్డుకోదు. అలా అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. కానీ స‌మాజం అనేది ఒక‌టి ఉంద‌ని తెలుసుకోవాలి. వీటి గురించి నియంత్రించ‌లేం. ప్ర‌శ్నించ లేం కూడా. ఇది చాలా సున్నిత‌మైన అంశం. దీని గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.

Also Read : ఒక్క‌ట‌వ‌నున్న పోలీస్ ఆఫీస‌ర్..మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!