KK Shailaja : మెగ‌సెసే అవార్డు నాకొద్దు – కేకే శైల‌జ‌

కేర‌ళ రాష్ట్ర మాజీ మంత్రి నిర్ణ‌యం

KK Shailaja :  కేర‌ళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ(KK Shailaja) షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచంలో విశిష్ట సేవ‌లు అందించే వారికి ప్ర‌తి ఏటా ఇచ్చే రామ‌న్ మెగ‌సెసే అత్యున్న‌త పుర‌స్కారం త‌న‌కు వ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం కేకే శైల‌జ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ష్ట స‌మ‌యంలో ఆమె ఆరోగ్య మంత్రిగా చ‌రిత్ర సృష్టించారు. క‌రోనా క‌ట్ట‌డికి ఎన‌లేని కృషి చేశారు.

త‌న వ్య‌క్తిగ‌త హోదాలో ఈ పుర‌స్కారాన్ని తాను స్వీక‌రించేందుకు సిద్దంగా లేనంటూ స్ప‌ష్టం చేశారు. ఫిలిప్పీన్స్ లో క‌మ్యూనిస్టుల‌పై క్రూర‌మైన అణ‌చివేత‌కు గురైన చ‌రిత్ర రామ‌న్ మెగ‌సెసేకు ఉంద‌ని సీపీఎం పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా జాతీయ నాయ‌క‌త్వాన్ని సంప్ర‌దించిన త‌ర్వాతే కేకే శైల‌జ(KK Shailaja) ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మీడియాకు స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్భంగా సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. అవార్డు ప్ర‌క‌టించినందుకు అభ్యంత‌రం ఏమీ లేదు. కానీ ఎవ‌రైతే దాడుల‌కు పాల్ప‌డ్డారో, ప్రాణాల‌ను హ‌రించారో వారి పేరు మీద పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డాన్ని మేం అభ్యంత‌రం పెడుతున్నాం.

అందుకే కేకే శైల‌జ‌కు రామ‌న్ మెగసెసే అవార్డు తీసుకోవ‌ద్ద‌ని తీర్మానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా కొంద‌రు మేధావులు పూర్తిగా త‌ప్పు ప‌డుతున్నారు.

ఎప్పుడో జ‌రిగిన దానికి ఇప్పుడు ఆపాదిస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది పూర్తిగా వివ‌క్ష పూరిత‌మైన‌దంటూ మండిప‌డ్డారు. స‌మిష్టి కృషిలో భాగ‌మైన ప‌ని చేసినందుకు అవార్డుకు ప‌రిగ‌ణించార‌ని వ్య‌క్తిగ‌త హోదాలో తాను తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు కేకే శైలజ‌.

Also Read : త‌నికెళ్ల భ‌ర‌ణికి లోక్ నాయ‌క్ అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!