KKR Retention List : క‌మిన్స్ ..బిల్లింగ్స్ ..ర‌హానే..పింఛ్ కు ఝ‌ల‌క్

16 మందిని వ‌దులుకున్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్

KKR Retention List : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఎప్ప‌టి లాగే ఆయా ఫ్రాంచైజీలు ఎవ‌రిని తీసుకోవాలో ఎవ‌రిని వ‌దులు కోవాలో బీసీసీఐ ఐపీఎల్ మేనేజ్ మెంట్ కు చెప్పాల్సి ఉంటుంది.

ఇందుకు సంబంధించి న‌వంబ‌ర్ 15న డెడ్ లైన్ విధించింది బీసీసీఐ. ఈ మేర‌కు అన్ని ఫ్రాంచైజీలు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి. ఈ మేర‌కు ఐపీఎల్ లో భాగంగా పెద్ద ఎత్తున ఆట‌గాళ్ల‌ను వ‌దులుకుంది మాత్రం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ జ‌ట్టు 16 మంది ఆట‌గాళ్ల‌ను వ‌దులుకుంటే ముంబై ఇండియ‌న్స్ 13 మందిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 9 మందిని వ‌ద్ద‌నుకుంది.

ఇక కేకేఆర్(KKR Retention List) జ‌ట్టుకు బాలీవుడ్ న‌టులు షారుక్ ఖాన్ , జూహీ చావ్లా తీసుకున్నారు. ఇక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే శ్రేయ‌స్ అయ్య‌ర్ ను కెప్టెన్ గా ఉంచింది. నితీష్ రానా, వెంక‌టేష్ అయ్య‌ర్ , సురేన్ న‌రైన్ , ఉమేష్ యాద‌వ్ , సౌథీ, హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అంకుల్ రాయ్ , రింకూ సింగ్ పెట్టుకుంది. ఇక శార్దూల్ ఠాకూర్ , ఫెర్గూస‌న్ , ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ ల‌ను ద‌క్కించుకుంది.

ఇక వ‌దులుకున్న వారిలో ఆసిస్ కు చెందిన పాట్ క‌మిన్స్ , సామ్ బిల్లింగ్స్ , అమ‌న్ ఖాన్ , శివ‌మ్ మావి, న‌బీ, చ‌మికా క‌రుణ ర‌త్నే , ఆరోన్ ఫించ్ , హేల్స్ , అభిజిత్ తోమ‌ర్ , అజింక్యా ర‌హానే , అశోక్ వ‌ర్మ‌, ఇంద్ర‌జిత్, ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్ , ర‌సీఖ్ స‌లామ్ , షెల్డ‌న్ జాక్స‌న్ ల‌ను వ‌దులుకుంది.

Also Read : తొమ్మ‌ది మంది ఆట‌గాళ్ల‌కు చెక్

Leave A Reply

Your Email Id will not be published!