MI vs KKR IPL 2022 : రాణించిన సూర్య..తిల‌క్ వ‌ర్మ

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టార్గెట్ 162

MI vs KKR IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. దీంతో ప్ర‌త్య‌ర్థి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(MI vs KKR IPL 2022) ముందు 162 ర‌న్స్ టార్గెట్ ఉంచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్ట‌లేదు. సూర్య కుమార్ యాద‌వ్ 52 ర‌న్స్ చేస్తే తిల‌క్ వ‌ర్మ 38 ప‌రుగుల‌తో మ‌రోసారి రాణించాడు. ఆఖ‌రులో వ‌చ్చిన పోలార్డ్ షాట్స్ ఆడ‌డంతో ఆ మాత్రం స్కోర్ చేసింది ముంబై ఇండియ‌న్స్ .

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్కిప్ప‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆఖ‌రులో వ‌చ్చిన డెవాల్ట్ బ్రెవిస్ 29 ర‌న్స్ చేస్తే పొలార్డ్ కేవ‌లం 5 బంతులు మాత్ర‌మే ఆడి మూడు సిక్స‌ర్లు కొట్టాడు. 22 ర‌న్స్ పిండుకున్నాడు.

ఇక కేకేఆర్ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ 2 వికెట్లు తీస్తే ఉమేష్ యాద‌వ్ , వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి చెరో వికెట్ తీశారు. సూర్య యాద‌వ్ 35 బంతులు ఆడి 5 ఫోర్లు రెండు సిక్స‌ర్లు కొట్టాడు. హాఫ్ సెంచ‌రీ దాటాడు. ముంబై ఇండియ‌న్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి పోయింది.

తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింట్లో విజ‌యం సాధించి ఒక‌టి ఓడి పోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఐపీఎల్ 14 సీజ‌న్ల‌లో చూస్తే కేకేఆర్ , ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య మొత్తం 29 మ్యాచ్ లు జ‌రిగాయి. ఇందులో కేకేఆర్ 7 సార్లు గెలిచింది.

Also Read : మామూలోడు కాదు మ‌గాడ్రా బుజ్జీ

Leave A Reply

Your Email Id will not be published!