KKR vs MI IPL 2022 : మార‌ని ముంబై గెలిచిన కోల్ క‌తా

52 ప‌రుగుల తేడాతో ఓట‌మి

KKR vs MI IPL 2022 : ఐపీఎల్ 2022లో ముంబై ఇండియ‌న్స్ ఆట తీరు మార‌డం లేదు. బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కొంప ముంచింది. త‌క్కువ స్కోర్ కే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేసినా ఆశించిన రీతిలో పోటీ ఇవ్వ‌లేక పోయింది ముంబై.

దీంతో 52 ప‌రుగుల తేడాతో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. 166 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ 113 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇషాన్ కిష‌న్ 51 ప‌రుగుల(KKR vs MI IPL 2022) స్కోర్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ 3 వికెట్లు తీస్తే ర‌స్స‌ల్ 2, సౌథీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో వికెట్ సాధించాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

క్రీజులోకి వ‌చ్చిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 165 ర‌న్స్ చేసింది(KKR vs MI IPL 2022). వెంక‌టేశ్ అయ్య‌ర్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. 43 ర‌న్స్ చేశాడు. ర‌హానే అన‌వ‌స‌రపు షాట్ ఆడ‌బోయి వికెట్ పారేసుకున్నాడు. 22 ర‌న్స్ చేశాడు.

కాగా జ‌స్ ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. మ‌రోసారి స‌త్తా చాటాడు.

బుమ్రా దెబ్బ‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మిడిల్ ఆర్డ‌ర్ పూర్తిగా పెవిలియ‌న్ బాట ప‌ట్టింది. ఇక బౌలింగ్ ప‌రంగా చూస్తే ఐపీఎల్(KKR vs MI IPL 2022) లో బుమ్రా సాధించిన ఈ ఫీట్ టాప్ .

అంత‌కు ముందు 5 వికెట్లు తీసిన వారిలో హ‌స‌రంగా 4 ఓవ‌ర్లో 18 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఎస్ ఆర్ హెచ్ ప్లేయ‌ర్ ఉమ్రాన్ మాలిక్ 4 ఓవ‌ర్లు వేసి 25 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

 

Also Read : తిప్పేసిన జస్ప్రీత్ బుమ్రా

Leave A Reply

Your Email Id will not be published!