KKR vs RR IPL 2022 : కోల్ క‌తా గెలిచేనా రాజ‌స్థాన్ నిలిచేనా

స‌మ ఉజ్జీల పోరులో గెలుపు ఎవ్వ‌రిదో

KKR vs RR  : ఐపీఎల్ 2022లో ఇవాళ ముంబై లోని వాంఖేడి స్టేడియంలో కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. శ్రేయ‌స్ అయ్యర్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్(KKR vs RR )మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ 9 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్ లు గెలుపొంది మూడింట్లో ఓట‌మి పాలైంది.

ఇక కోల్ క‌తా 9 మ్యాచ్ లు ఆడింది 3 మ్యాచ్ లు గెలుపొంది 6 మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.

ఇరు జ‌ట్ల ప‌రంగా చూస్తే రాజ‌స్థాన్ రాయ‌ల్స్(KKR vs RR )బ‌లంగానే క‌నిపిస్తున్నా కెప్టెన్ ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు. ఇక కోల్ క‌తా ఆశించిన మేర రాణించ‌డం లేదు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సంజూ శాంస‌న్ కెప్టెన్. జోస్ బ‌ట్ల‌ర్ , రాస్సీ వాన్ డ‌స్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీష‌మ్ ,

శుభ‌మ్ గ‌ర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయ‌ర్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , య‌జువేంద్ర చ‌హ‌ల్ ఆడ‌నున్నారు.

వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , ప్ర‌సీద్ కృష్ణ‌, తేజాస్ బ‌రోకా, ఓబెద్ మెకాయ్, రియాన్ ప‌రాగ్,

డారిల్ మిచెల్ , అనున‌య్ సింగ్ , య‌శ‌స్వి జైస్వాల్ , న‌వ‌దీప్ సైనీ, క‌రుణ్ నాయ‌ర్, కేసి క‌రియ‌ప్ప‌, కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

Also Read : ఫామ్ లోకి వ‌చ్చిన కోహ్లీ అనుష్క హ్యాపీ

Leave A Reply

Your Email Id will not be published!