KKR vs SRH IPL 2022 : తిప్పేసిన రస్సెల్ తలవంచిన హైదరాబాద్
54 పరుగుల తేడాతో నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్
KKR vs SRH IPL 2022 : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. సన్ రైజర్స్(KKR vs SRH IPL 2022) పై 54 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నితీశ్ రాణా 26 పరుగులు, అజింక్యా రహానే 28 పరుగులతో రాణించారు. కెప్టెన్ అయ్యర్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇదే సమయంలో మైదానంలోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ దుమ్ము రేపాడు.
సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు సిక్సర్ల మోత మోగించాడు. 49 పరుగులు చేసి సత్తా చాటాడు. రస్సెల్ కు తానేమీ తీసిపోనంటూ సామ్ బిల్లింగ్స్ సైతం అద్భుతంగా ఆడాడు. 34 కీలక రన్స్ చేసి స్కోరు పెంచేలా చేశాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన
సన్ రైజర్స్(KKR vs SRH IPL 2022) హైదరాబాద్ రస్సెల్ కొట్టిన దెబ్బకు ఠారెత్తింది.
20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. దీంతో పరాజయం తప్పలేదు. అభిషేక్ శర్మ 28 బంతులు ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో 43 రన్స్ చేశాడు.
ఎయిడెన్ మార్క్ రమ్ 25 బంతులు ఆడి 3 సిక్స్ లతో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక 49 పరుగులు చేయడమే కాకుండా 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు రస్సెల్.
ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది కేకేఆర్.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 178
