INDvsSA 2nd ODI : మొదటి వన్డే మ్యాచ్ లో 31 పరుగులతో ఓడి పోయిన టీమిండియా రెండో వన్డే మ్యాచ్(INDvsSA 2nd ODI) లో గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.
దీంతో ప్రత్యర్థి సఫారీ జట్టు ముందు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆట ఆరంభంలోనే శిఖర్ ధావన్ 29 పరుగులు చేసి వెనుదిరిగితే మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.
ఈ తరుణంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బాధ్యతా యుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెచ్చి పోయాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఏకంగా 85 పరుగులు చేసి మూడో వికెట్ కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ భారీ స్కోర్ (INDvsSA 2nd ODI)సాధిస్తుందని అనుకున్నారంతా .
కానీ 2 వికెట్లు కోల్పోయి 183 పరుగులతో ఉన్న టీమిండియా ఆ వెనువెంటనే పంత్, రాహుల్ వికెట్లను పారేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎదుర్కొలేక పోయారు.
చివరలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ 40 పరుగులు చేసి స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. ఇక ప్రత్యర్థి సఫారీ టీమ్ లో తబ్రైజ్ షంసీ 2 వికెట్లు తీసీ్తే మగల, మార్క్రమ్ , కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా 288 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీం కడపటి వార్తలు అందేసరికల్లా వికెట్ కోల్పోకుండా 40 పరుగులతో ఆడుతోంది.
Also Read : తగ్గేదేలే అంటున్న వార్నర్ భయ్యా