KL Rahul IPL 2022 : రాహుల్ రాణించినా త‌ప్ప‌ని ఓట‌మి

దీప‌క్ హుడాతో క‌లిసి భారీ పార్ట‌న‌ర్ షిప్

KL Rahul IPL 2022 : కేఎల్ రాహుల్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ జ‌రిగిన ప్ర‌తి సీజ‌న్ లో వ్య‌క్తిగ‌త స్కోర్ చేస్తూ స‌త్తా చాటుతూ వ‌చ్చాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా స‌క్సెస్ కాలేక పోయాడు.

ఐపీఎల్ 2022లో బెంగళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా వేలం పాట‌లో కొత్త‌గా ఏర్పాటైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు ఎంపిక‌య్యాడు. భారీ ధ‌ర‌కు అత‌డిని కొనుగోలు చేసింది. యాజ‌మాన్యం అనుకున్న‌ట్టుగానే న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు.

వ్య‌క్తిగతంగానే కాదు జ‌ట్టును కూడా ప్లే ఆఫ్స్ వ‌ర‌కు తీసుకు వ‌చ్చాడు. ఒకానొక స‌మ‌యంలో ఐపీఎల్ 2022 టైటిల్ గెలుస్తుంద‌న్న ఆశ‌లు రేకెత్తించాడు.

కానీ అనుకోని రీతిలో కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓడి పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు లోన‌య్యాడు.

ప్ర‌త్యేకించి ల‌క్నోకు హెడ్ కోచ్ గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ, ఒక‌ప్ప‌టి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఉన్నాడు. ఎప్పుడూ ఓట‌మిని ఒప్పుకోని గంభీర్ ముఖం లో విషాదం అలుముకుంది.

ఎంతో క‌ష్ట‌ప‌డి చివ‌రి దాకా వ‌చ్చిన ల‌క్నో చిన్న పొర‌పాట్ల కార‌ణంగా భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వ‌చ్చింది. ఓ వైపు వికెట్లు కూలుతున్నా అద్భుతంగా ఆడాడు కెప్టెన్ కేఎల్ రాహుల్.

నిజ‌మైన నాయ‌కుడు ఎలా ఉండాలో చూపించాడు కూడా. కానీ దుర‌దృష్టం వెంటాడింది ల‌క్నోను. మొత్తంగా కేఎల్ రాహుల్(KL Rahul IPL 2022) 58 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు 5 సిక్స్ ల‌తో 79 ర‌న్స్ చేశాడు. కానీ ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించ లేక పోయాడు.

Also Read : వారెవ్వా దీప‌క్ హూడా సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!