Sunil Gavaskar : భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar )నిప్పులు చెరిగారు.
నాయకుడిగా కేఎల్ రాహుల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. నాయకత్వ లేమి పూర్తిగా కనిపించిందన్నాడు. ప్లేయర్లను ఎలా వాడుకోవాలో కూడా రాహుల్ కు తెలియక పోవడం దారుణమన్నాడు.
భారత జట్టు అటు టెస్టు సీరీస్ తో పాటు మూడు వన్డేలలో సైతం పూర్తిగా ఓడిపోయి సీరీస్ పోగొట్టుకుంది. ఈ తరుణంలో గవాస్కర్ (Sunil Gavaskar )స్పందించాడు.
కేఎల్ రాహుల్ కు అంతర్జాతీయ పరంగా నాయకత్వం వహించిన అనుభవం లేక పోవడం కూడా ప్రధానంగా టీమిండియాకు శాపంగా మారిందన్నాడు.
ఇలాగైతే భారత జట్టు మరిన్ని అపజయాలను మూటగట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అంతే కాకుండా రాహుల్ ద్రవిడ్ మెతక వైఖరి మానుకోవాలని సూచించాడు.
మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్ లో కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు గవాస్కర్. మొత్తంగా చూస్తే భారత జట్టులో ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడినట్లు తనకు అనిపిస్తోందని బాంబు పేల్చాడు.
ఇదిలా ఉండగా కెప్టెన్ గా కాకుండా బ్యాటర్ గా కూడా కేఎల్ రాహుల్ దారుణంగా వైఫల్యం చెందాడని మండిపడ్డాడు సన్నీ.
జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుపై పై చేయి ఎలా సాధించాలని ఏ కెప్టెన్ అయినా ఆలోచిస్తాడని కానీ కేఎల్ రాహుల్ అలా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read : టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రిజ్వాన్