KL Rahul Injured : కేఎల్ రాహుల్ కు గాయం ఆడేది కష్టం
ప్రాక్టీస్ సెషన్ లో స్టాండ్ ఇన్ కెప్టెన్
KL Rahul Injured : భారత క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బంగ్లాతో జరిగిన మొదటి టెస్టుకు దూరమయ్యాడు. నేరుగా ముంబైకి చెక్కేశాడు.
ఈ తరుణంలో అతడి తరపున ఇతర ఆటగాళ్లను ఎంపిక చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). రెండు టెస్టుల సీరీస్ లో మొదటి టెస్టు లో అద్భుత విజయాన్ని సాధించింది. కేఎల్ రాహుల్ స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. రోహిత్ శర్మకు బదులుగా కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు.
ఇక ఉప సారథిగా ఛతీశ్వర్ పుజారా ఉన్నాడు. ఇదిలా ఉండగా రెండో టెస్టు డిసెంబర్ 22న గురువారం నుంచి బంగ్లాదేశ్ తో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు(KL Rahul Injured). ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడాడు. కేఎల్ రాహుల్ కు వైద్యుడు చికిత్స చేస్తున్నాడని, ఆడేది లేనిది అనేది ప్రస్తుతం చెప్పలేమని స్పష్టం చేశాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా చేతికి గాయమైందని తెలిపాడు రాథోడ్. వైద్యులు ఇంకా ఏ విషయం చెప్పలేదన్నాడు.
త్వరలో కోలుకుని రెండో టెస్టుకు ఆడతాడనే తాను భావిస్తున్నట్లు తెలిపాడు బ్యాటింగ్ కోచ్. మరో వైపు బీసీసీఐ అనుసరిస్తున్న ఎంపిక విధానం పట్ల తీవ్ర విమర్శలు వున్నాయి. ప్రధానంగా బాగా ఆడుతున్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టడాన్ని తప్పు పడుతున్నారు.
Also Read : పీసీబీ చీఫ్ రమీజ్ ఔట్ సేథికి ఛాన్స్