Rahul Dravid : కేఎల్ రాహుల్ పుంజుకోవ‌డం ఖాయం

స్ప‌ష్టం చేసిన హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్

Rahul Dravid : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వ‌ర్షం కార‌ణంగా ఏ జ‌ట్లు సెమీస్ కు వెళ‌తాయ‌నేది ఉత్కంఠ భ‌రితంగా మారింది. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ లు ఆడింది.

పాకిస్తాన్, నెద‌ర్లాండ్స్ పై విజ‌యం సాధించ‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓట‌మి పాలైంది. గ‌త కొంత కాలంగా స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన స్టార్ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (KL Rahul)పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న టీమిండియాకు ఇబ్బందిగా మారింది. జ‌ట్టులో ఎందుకు కొన‌సాగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీనిపై తీవ్రంగా స్పందించాడు భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. కేఎల్ రాహుల్ ప్ర‌తిభావంత‌మైన క్రికెట‌ర్. అత‌డి ఫామ్ మీద త‌మ‌కు అనుమానం లేద‌న్నాడు. అంతే కాదు త్వ‌ర‌లోనే పుంజుకుంటాడ‌ని, రాణిస్తాడ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid). ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగా ఆడాడ‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా కేఎల్ రాహుల్ పాకిస్తాన్ తో 4 ప‌రుగులు చేస్తే, నెద‌ర్లాండ్స్ లో 9 ర‌న్స్ , ద‌క్షిణాఫ్రికాతో 9 ప‌రుగులు చేశాడు. కేవ‌లం 22 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ ప‌రిచాడు కేఎల్ రాహుల్. భ‌విష్య‌త్తులో అత‌డి ఆట తీరు అద్భుతంగా ఉంద‌ని కితాబు ఇచ్చాడు. క్రికెట‌ర్ అన్నాక ఒడిదుడుకులు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌ని స్ప‌ష్టం చేశాడు.

కేఎల్ రాహుల్ కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎప్పుడు ఎలా ఆడాలో అత‌డికి బాగా తెలుస‌ని పేర్కొన్నాడు.

Also Read : భార‌త్ బంగ్లాదేశ్ కీల‌క మ్యాచ్

Leave A Reply

Your Email Id will not be published!