Lucknow IPL 2022 : రూ. 17 కోట్లు ప‌లికిన కేఎల్ రాహుల్

స్వంతం చేసుకున్న ల‌క్నో ఫ్రాంచైజీ

Lucknow IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఇది ఓ రికార్డుగా భావించ‌క త‌ప్ప‌దు. ఈ ఏడాది ఐపీఎల్ రిచ్ లీగ్ కోసం మెగా వేలం ప్రారంభమైంది. భార‌తీయ ఐపీఎల్ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.

ప్ర‌స్తుతం అత‌ను భార‌త క్రికెట్ జ‌ట్టుకు తాత్కాలిక సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇట‌వ‌ల బీసీసీఐ నిర్వ‌హించిన వేలంలో రెండు జ‌ట్ల‌కు చాన్స్ ఇచ్చింది.

అందులో ఒక‌టి అహ్మ‌దాబాద్ కాగా రెండోది ల‌క్నో. మొద‌టి నుంచీ ఊహాగానాలు వెలువడ్డాయి. కేఎల్ రాహుల్ ను ల‌క్నో ఫ్రాంచైజీ(Lucknow IPL 2022) తీసుకోనుంద‌ని. కానీ ఎంత మొత్తానికి తీసుకుంద‌నేది ఇంత వ‌ర‌కు స‌స్పెన్స్ లో ఉంచింది.

తాజాగా కేఎల్ రాహుల్ ను ఏకంగా ల‌క్నో ఫ్రాంచైజీ రూ. 17 కోట్ల‌కు తీసుకుందని స‌మాచారం. క్యాష్ రిచ్ లీగ్ లో ఇప్పుడు అత‌డికే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన‌ట్లు భావించ‌క త‌ప్ప‌దు.

గ‌తంలో ఐపీఎల్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు యాజ‌మాన్యం విరాట్ కోహ్లీని అత్య‌ధిక ధ‌ర‌కు వేలం పాట‌లో ద‌క్కించుకుంది. ఇదిలా ఉండ‌గా కేఎల్ రాహుల్ గ‌తంలో ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు.

ప్ర‌తి ఐపీఎల్ లో మినిమం గ్యారెంటీ తో టాప్ స్కోర‌ర్ జాబితాలో చోటు సంపాదించుకుంటూ వ‌చ్చాడు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మెగా వేలానికి ముందు ల‌క్నో, అహ్మ‌దాబాద్ తాము తీసుకోబోయే పేర్ల‌ను వెల్ల‌డించ‌డం విశేషం.

అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, ర‌షీద్ ఖాన్ , శుభ్ మ‌న్ గిల్ ల‌ను తీసుకున్న‌ట్లు తెలిపింది. కాగా ల‌క్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్, మార్క‌స్ స్టోయినిస్ , ర‌వి బిష్ణోయ్ ల‌ను ఓన్ చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా స్టోయినిస్ ను రూ. 9.2 కోట్ల‌కు, బిష్ణోయ్ ను రూ. 4 కోట్ల‌కు ఒప్పందం చేసుకుంది.

Also Read : భార‌త్ ప‌రాజ‌యం స‌ఫారీ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!