KL Rahul : ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. నా వరకైతే పూర్తిగా సానుకూల దృక్ఫథంతో ఉంటానని స్పష్టం చేశాడు భారత వన్డే జట్టు స్కిప్పర్ కేఎల్ రాహుల్(KL Rahul ).
బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ ఇవాళ మాట్లాడాడు. దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.
ఇదిలా ఉండగా తొడ కండరాలు పట్టేయడంతో సఫారీ సీరీస్ కు పూర్తిగా దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఈ తరుణంలో విరాట్ కోహ్లి కూడా తప్పుకోవడంతో ప్రస్తుతం కేఎల్ రాహుల్ మూడు వన్డేల సీరీస్ కు సారథిగా నాయకత్వం వహించనున్నాడు.
రేపటి నుంచి వన్డే సీరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే టెస్టు సీరీస్ కోల్పోయిన భారత్ కనీసం వన్డే సీరీస్ గెలుపొంది పోయిన పరువు కాపాడు కోవాలని ప్రయత్నాల్లో మునిగింది.
నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ లో ఆటగాళ్లు మునిగి పోయారు. ప్రతి మ్యాచ్ ను తాను యుద్ధంగా భావిస్తానని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్(KL Rahul ). ఓడి పోయినప్పుడు బాధ పడను విజయం వరించినప్పుడు సంతోషించను.
రెండింటిని సమానంగా చూస్తానని చెప్పాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం జరగబోయే వన్డీ సీరీస్ పై ఫోకస్ పెట్టామన్నాడు. అన్ని విభాగాలలో తాము మెరుగైన పనితీరు కనబరుస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు తాత్కాలిక స్కిప్పర్ కేఎల్ రాహుల్.
దీంతో వన్డే సీరీస్ పై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కోహ్లీ ఎల్లప్పటికీ సూపర్ హీరో