KL Rahul : ర‌న్స్ మారథాన్ కేఎల్ రాహుల్

ఐపీఎల్ లో అత్య‌ధిక ధ‌ర అత‌డికే

KL Rahul :  (Indian Cricket team) లో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్. ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ లో ల‌క్నో క్రికెట్ జెయింట్స్ కు సార‌థిగా ఉన్నాడు. ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని ధ‌ర‌కు అమ్ముడు పోయాడు.

ఇది భార‌త క్రికెట‌ర్ల‌లో ఓ రికార్డ్. 1992 ఏప్రిల్ 18న క‌ర్ణాట‌క లోని మ‌గాడి తాలూకా క‌న‌నూర్ లో పుట్టాడు. పేరెంట్స్ ఇద్ద‌రూ ప్రొఫెస‌ర్లు.

కుడి చేతి వాటం బ్యాట‌ర్. వికెట్ కీప‌ర్ కూడా. ప్ర‌స్తుతం (Indian Cricket team) కు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.

నిల‌క‌డ‌గా ఆడ‌టం. కూల్ గా ఉండ‌డం, సానుకూల ధోర‌ణిని నిరంత‌రం ఇష్ట‌ప‌డే

ఈ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్రికెట్ లో కేఎల్ రాహుల్ (KL Rahul )ది ప్ర‌త్యేకం.

ఇత‌ర ఆట‌గాళ్ల‌కు సాధ్యంకాని రీతిలో ఆడ‌డం అత‌డికే చెల్లింద‌ని కితాబు ఇచ్చాడు దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్.

లారా అయితే తాను ఇష్ట‌ప‌డే క్రికెట‌ర్ అని పేర్కొన్నాడు.

అటు సంప్ర‌దాయ ఆట‌నే కాదు ఆధునిక టెక్నిక్ ను అల‌వోక‌గా ఆడే ఏకైక ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్(KL Rahul ).

ప్ర‌స్తుతం అన్ని ఫార్మాట్ ల‌లో ప‌రుగులు సాధించ గలిగే స‌త్తా ఉన్న ఆట‌గాడు.

ఐపీఎల్ 2022 (IPL 2022) లో కొత్త‌గా ఏర్పాటైన (Lucknow Super Giants team) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్ కు స్కిప్ప‌ర్ గా ఎంపిక‌య్యాడు.

అంత‌కు ముందు ఐపీఎల్ లో నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్ కు నాయ‌కుడిగా ఉన్నాడు.

2014లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ లోకి ఎంట‌రైన కేఎల్ రాహుల్ రెండో టెస్టులో తొలి సెంచ‌రీని సాధించాడు. ప్ర‌స్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూనే ఉన్నాడు. వ్య‌క్తిగ‌తంగా ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో టాప్ లో ఉన్న‌ప్ప‌టికీ పంజాబ్ ను గ‌ట్టెక్కించ లేక పోయాడు.

2013లో ఐపీఎల్ లోకి ఎంట‌ర్ అయ్యాడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున‌. 2016లో స‌న్ రైజ‌ర్స్ రూ. కోటికి తీసుకుంది. గాయం కార‌ణంగా 2017లో ఐపీఎల్ కు దూర‌మ‌య్యాడు.

2018లో పంజాబ్ కింగ్స్ రూ. 11 కోట్ల‌కు తీసుకుంది. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు రాహుల్. ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

2022 ఐపీఎల్ మెగా వేలంలో ల‌క్నో ఏకంగా రాహుల్ ను రూ. 17 కోట్ల‌కు తీసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. అత‌డి సంపాద‌న ఏకంగా రూ. 75 కోట్లు అని అంచ‌నా.

Also Read : అయ్య‌ర్ అయ్యారే ఆట భ‌ళారే

Leave A Reply

Your Email Id will not be published!