KL Rahul Shreyas Iyer : అయ్యర్ అదుర్స్ రాహుల్ సూపర్
బెంగళూరులో పరుగుల వరద
KL Rahul Shreyas Iyer : బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుతమైన స్కోర్ సాధించింది. నెదర్లాండ్స్ జట్టుకు చుక్కలు చూపించారు. కేవలం 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 410 రన్స్ తో భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. వచ్చీ రావడంతోనే పరుగుల వరదకు తెర తీశారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏక పక్షంగా సాగింది.
KL Rahul Shreyas Iyer Innings
కెప్టెన్ రోహిత్ శర్మ 8 ఫోర్లు 2 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 3 ఫోర్లు 4 సిక్సర్లతో 51 రన్స్ చేస్తే విరాట్ కోహ్ఈ 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 51 రన్స్ తో రాణించారు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ రెచ్చి పోయాడు. కేవలం 94 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 5 సిక్సర్లతో 128 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక కేఎల్ రాహుల్(KL Rahul) సైతం మరో వైపు రెచ్చి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 64 బాల్స్ ఎదుర్కొని 11 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 102 తో సెంచరీ చేశాడు. కేవలం 4 వికెట్లు కోల్పోయి 410 రన్స్ చేసింది. ఇది భారీ స్కోర్ చేసింది.
ఇదిలా ఉండగా వన్డే వరల్డ్ కప్ లో వరుసగా భారత జట్టుకు ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో నాలుగు జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. భారత్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బరిలో ఉన్నాయి.
Also Read : IND vs NED ICC ODI World Cup : వరల్డ్ కప్ లో భారత్ రికార్డ్ స్కోర్