Kodali Nani : జగన్ తో పెట్టుకుంటే జైలుకే
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని
Kodali Nani : విజయవాడ – ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి అవినీతి గురించి పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆయన తనయుడు పప్పు నాయుడు ఇప్పుడు ఏమంటారో చెప్పాలని సవాల్ విసిరారు.
Kodali Nani Comments on Chandrababu Naidu
ఇంత కాలం వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు పాపం పండిందన్నారు. జగన్ రెడ్డితో పెట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికైనా అర్థమై ఉంటుందన్నారు కొడాలి నాని(Kodali Nani).
జగన్ అవినీతికి పాల్పడ్డాడని రెడ్ డైరీలో వివరాలు ఉన్నాయని ప్రగల్భాలు పలికిన లోకేష్ ఇప్పుడు తన తండ్రి చేసిన అవినీతి, అక్రమాల గురించి తన డైరీలో రాసు కోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కరప్షన్ ను బయట పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన ఘనత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.
రాబోయే రోజుల్లో ఫైబర్ నెట్ , ఇన్నర్ రోడ్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన నారా లోకేష్ కు , చంద్రబాబు అవినీతికి సపోర్ట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేయడం తప్పదని మాజీ మంత్రి జోష్యం చెప్పారు.
Also Read : RK Roja Selvamani : లోకేష్..పవన్..అచ్చెన్న అరెస్ట్ తప్పదు