Kodandaram : కోదండ‌రాం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌ట‌న

Kodandaram : తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, మేధావి తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం(Kodandaram) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తాను ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకోవ‌డం లేదంటూ స్ప‌ష్టం చేశారు.

Kodandaram Comments Viral

ప్రొఫెస‌ర్ చేసిన ఈ కామెంట్స్ రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపాయి. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌క్సెస్ లో కీల‌క భూమిక పోషించారు. కేసీఆర్ తో విభేదించారు. తెలంగాణ వ్యాప్తంగా దివంగ‌త జ‌య‌శంక‌ర్ సార్ తో క‌లిసి ఎన్నో వేదిక‌ల‌లో ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ జ‌న స‌మితి పేరుతో పార్టీని స్థాపించారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌బెట్టారు. కానీ ఏ ఒక్క సీటు గెల‌వ‌లేదు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయాల‌ని ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత విర‌మించుకున్నారు.

ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌లే కీల‌కం. ఓటు వ‌జ్రాయుధం. కానీ ఈ తెలంగాణ మేధావి ఉన్న‌ట్టుండి అస్త్ర స‌న్యాసం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : HCA Election : హెచ్‌సీఎ ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!