Telangana BJP Focus : బీజేపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఫోక‌స్

జేపీ న‌డ్డాతో కిష‌న్ రెడ్డి భేటీ

Telangana BJP Focus : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ 119 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. 115 మందికి బీ ఫార‌మ్ లు రెడీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌గ‌నాకి పైగా అభ్య‌ర్థుల‌కు అంద‌జేశారు. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఖ‌రారు చేసింది. ఇందులో 55 మందికి సీట్ల‌ను కేటాయించింది.

Telangana BJP Focus on Candidates Selection

ఇదిలా ఉండ‌గా ఈసారి ఎలాగైనా స‌రే రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని భావిస్తోంది కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ మేర‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. బీఆర్ఎస్ స‌ర్కార్ పై బాణాలు ఎక్కు పెట్టింది. ఈ త‌రుణంలో ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి కాషాయ పార్టీకి. ఇప్ప‌టి వ‌ర‌కు సీట్ల‌ను ఖ‌రారు చేయ‌లేదు బీజేపీ(BJP) స్టేట్ చీఫ్ కిష‌న్ రెడ్డి.

దీంతో ఎవ‌రికి సీట్లు ద‌క్కుతాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం పార్టీ హై క‌మాండ్ ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పార్టీ చీఫ్ తో పాటు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్, మాజీ చీఫ్‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్, జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ హాజ‌ర‌య్యారు. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిపై చ‌ర్చించారు.

Also Read : Kodandaram : కోదండ‌రాం సంచ‌ల‌న నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!