Revanth Reddy : తెలంగాణ‌ను న‌ట్టేట ముంచిన కేసీఆర్

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : పెద్ద‌ప‌ల్లి – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చార‌ని ఆరోపించారు. 60 ఏళ్ల తెలంగాణ క‌ల‌ను సాకారం చేసిన ఘ‌న‌త సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ ఇచ్చార‌ని అన్నారు.

Revanth Reddy Slams KCR

తెలంగాణ పేరుతో రాజ‌కీయం చేయ‌డం, అందినంత మేర దండుకోవ‌డం , దోచిన వాటిని దాచు కోవ‌డం చేశార‌ని , ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌ను న‌ట్టేట ముంచార‌ని మండిప‌డ్డారు టీపీసీసీ చీఫ్‌. ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కేటీఆర్ ను స‌న్నాసి అంటూ మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రేవంత్ రెడ్డి.

కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. రాహుల్ కాలి గోటికి కూడా కేటీఆర్ స‌రి పోడంటూ స్ప‌ష్టం చేశాడు టీపీసీసీ చీఫ్‌.

Also Read : Telangana BJP Focus : బీజేపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!