YSR Awards : 27 మందికి వైఎస్సార్ అవార్డులు

లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పుర‌స్కారం

YSR Awards : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ఏపీ స‌ర్కార్ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే మాజీ సీఎం , దివంగ‌త డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరుతో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం పేరుతో అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ పుర‌స్కారాల‌ను వెల్ల‌డించింది.

YSR Awards Viral

న‌వంబ‌ర్ 1న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన వారికి అవార్డుల‌ను బ‌హూక‌రించ‌నున్నారు. ఈ ఏడాది 27న అవార్డులకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించనుంది రాష్ట్ర స‌ర్కార్.

అవార్డుల‌కు సంబంధించి మొత్తం 23 మందికి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి(YSR) జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాల‌కు ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించింది. మ‌రో న‌లుగురికి ఆయా రంగాల‌లో విశిష్ట సేవ‌లు అందించిన వాళ్లకు అచీవ్ మెంట్ పుర‌స్కారాల‌కు ఎంపిక చేసింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల‌కు గాను ఎంపికైన వారికి ఒక్కొక్క‌రికీ రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు, ప్ర‌తిమ‌, శాలువాతో స‌త్క‌రించ‌నున్నారు. ఇక అచీవ్ మెంట్ అవార్డు పొందిన వారికి రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దు, వైఎస్సార్ విగ్ర‌హం , శాలువా బ‌హూక‌రిస్తారు.

Also Read : Revanth Reddy : తెలంగాణ‌ను న‌ట్టేట ముంచిన కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!