Kohli Gambhir Row : నా ప్లేయర్ ను తిడితే నన్ను తిట్టినట్లే
విరాట్ కోహ్లీపై భగ్గుమన్న గౌతమ్ గంభీర్
Kohli Gambhir Row : దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్(Kohli Gambhir Row) మధ్య వివాదం. ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం మైదానంలో ఇద్దరి మధ్య తోపులాటకు దారి తీసింది. కోహ్లీ, గంభీర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రంగంలోకి దిగింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని అనుసరించి విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఇదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కు కూడా మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది.
వివాదానికి కారణం విరాట్ కోహ్లీనేనంటూ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అమిత్ మిశ్రా అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. కోహ్లీ పదే పదే నవీన్ ఉల్ హక్ ను పదే పదే దుర్భాష లాడాడని వాపోయాడు. విరాట్ మాట్లాడుతుండగా కైల్ మేయర్స్ ను ఇటు రమ్మంటూ పిలిచాడు మైదానంలో ఉన్న గౌతమ్ గంభీర్. దీంతో కోహ్లీ ఏదో అనడం గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం కనిపించింది.
ఈ సందర్భంగా గంభీర్ కోహ్లీని ఉద్దేశించి క్యా బోల్ రహా హై బోల్ (నువ్వు ఏమి చెబుతున్నావు) అని అడిగాడు. దీనికి కోహ్లీ మైనే ఆప్కో కుచ్ బోలా హై నహీం ఆప్ క్యోన్ ఘుస్ రహేన్ హూ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో సీరియస్ అయ్యాడు గంభీర్. నువ్వు నా ప్లేయర్ ను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్టేనని పేర్కొన్నాడు.
Also Read : ఇక చాలు..దేశం సిగ్గు పడుతోంది