Virat Kohli : భార‌త టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై

విరాట్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Virat Kohli : భార‌త క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను భార‌త టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న అధికారికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. సౌతాఫ్రికా టూర్ లో భాగంగా టీమిండియా మూడు టెస్టుల సీరీస్ లోను 1-2 తేడాతో ఓడి పోయింది. ఆ వెంట‌నే కోహ్లీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం భార‌త క్రికెట్ లో క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే కోహ్లీని బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ టీ20, వ‌న్డే జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. ఈ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) త‌న అభిప్రాయాన్ని తెలియ చేశాడు.

ఇంత కాలం పాటు నా దేశానికి నాయ‌కత్వం వ‌హించే అవ‌కాశాన్ని క‌ల్పించినందుకు భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐకి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.

మొద‌టి రోజు నుంచి జ‌ట్టు క‌సోం దృష్టి సారించిన‌, స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క ఆట‌గాడిని అభినందిస్తున్న‌ట్లు తెలిపాడు. టీమిండియాను స‌రైన మార్గంలో విజ‌య ప‌థంలో న‌డిపించేందుకు గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డ్డాను.

తీవ్రంగా శ్ర‌మించాను. ప్ర‌తి రోజూ ఎడ‌తెగ‌ని ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేశాన‌ని స్ప‌ష్టం చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). పూర్తి నిజాయితీతో, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేశాన‌ని తెలిపాడు.

ఏదో ఒక రోజు ఎంత‌టి స్థాయిలో ఉన్న ఆట‌గాడైనా గుడ్ బై చెప్పాల్సిందేనంటూ పేర్కొన‌డం విశేషం. ఇప్ప‌టి దాకా నేను వంద శాతం ఆడాన‌నే న‌మ్ముతున్నా. ఇక నుంచీ కూడా తాను దేశం కోసం ఆడ‌తాన‌ని ప్ర‌క‌టించాడు కోహ్లీ.

Also Read : 21న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!