Ravichandran Ashwin : భారత టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ నిర్ణయంపై తాజా, మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు.
కొందరు ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తం చేస్తే మరికొందరు ఈ క్లిష్ట సమయంలో తప్పు కోవడం జట్టుకు మంచిది కాదన్నారు.
ఈ తరుణంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ తప్పు కోవడంపై. గాడి తప్పిన టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు రావడంలో ఎంతగానో కృషి చేశాడని కొనియాడారు.
ఏడేళ్ల పాటు జట్టును అన్ని ఫార్మాట్ లలో బలమైన, అత్యంత శక్తివంతమైన టీమ్ గా తయారు చేయడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడంటూ కితాబు ఇచ్చాడు అశ్విన్.
భారత దేశ క్రికెట్ చరిత్రలో ఎందరో నాయకులు, ఆటగాళ్లు ఉన్నారని కానీ కోహ్లీ లాంటి ఆటగాడు వెరీ వెరీ స్పెషల్ అని పేర్కొన్నాడు. కోహ్లీతో ఉంటే ఫుల్ జోష్ తో పాటు ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న ధైర్యం, కసి వస్తుందన్నాడు.
అంతలా జట్టును వెన్నంటి ఉండి ప్రోత్సహించే నాయకుడు అతడు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు రవిచంద్రన్ అశ్విన్.
జట్టు స్కిప్పర్ అనేసరికల్లా విజయాలు మాత్రమే గుర్తు పెట్టుకుంటారని కానీ అన్నింటికంటే గెలుపు సంగతి పక్కన పెడితే అత్యంత స్పూర్తి దాయకమైన క్రికెటర్ కోహ్లీ అని పేర్కొన్నాడు.
ఎల్లప్పుడూ ఓటమి ఒప్పుకోని నాయకుడు అని తెలిపాడు అశ్విన్. వర్దమాన ఆటగాళ్లకే కాదు భవిష్యత్ లో క్రికెట్ ఆడాలని అనుకునే ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్ గా ఉంటాడని అన్నారు.
Also Read : ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదు