Sachin Tendulkar :భారత క్రికెట్ టెస్టు స్కిప్పర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లీ నిర్ణయంపై స్పందించాడు భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్(Sachin Tendulkar).
ఈ సమయంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు.
ఎప్పుడు ఆడినా వంద శాతం ఇచ్చేలా ప్రయత్నం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడని కితాబు ఇచ్చాడు. గత ఏడు సంవత్సరాల నుంచి కోహ్లీ టీమిండియాను అద్భుతంగా తయారు చేశాడని పేర్కొన్నాడు టెండూల్కర్(Sachin Tendulkar).
అన్ని ఫార్మాట్ లలో రాణించాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఇక కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. అద్భుతమైన విజయాలు నమోదు చేయడంలో ఎనలేని కృషి చేశాడు.
ఏది ఏమైనా ప్రతి ఆటగాడు ఏదో ఒక రోజు ఆట నుంచి నిష్క్రమించక తప్పదన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని తాను అనుకుంటున్నట్లు కితాబు ఇచ్చాడు.
వ్యక్తిగతంగా తాను కోహ్లీని ఇష్ట పడతానని అయితే ఒక్కోసారి అన్ని రిజల్ట్స్ మనకు అనుకూలంగా రావాలని అనుకోవడం కష్టమైన పని అని అన్నాడు. దేశంలో క్రికెట్ అన్నది ఓ మతంగా చూస్తారు.
దీంతో క్రికెట్ ఆడే ఆటగాళ్లపై ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని గతంలో ఇంత ఒత్తిడి ఉండేది కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం సీన్ మారిందని, ఫార్మాట్ కూడా మార్పులు చోటు చేసుకోవడం కూడా ఇంకో కారణమని తెలిపాడు టెండూల్కర్.
Also Read : రిజల్ట్స్ రానందుకే గుడ్ బై చెప్పా