Kohli Dravid : ప్రపంచ క్రికెట్ లో అతడు అద్భుతమైన ఆటగాడు. ఇందులో సందేహం లేదు ఎవరికీ. సుదీర్ఘ భారతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో అలవోకగా పరుగులు సాధిస్తూ వచ్చిన దిగ్గజ క్రికెటర్ కోహ్లీ(Kohli Dravid ). 68 టెస్టులకు నాయకత్వం వహించాడు.
ఇందులో 40 విజయాలు కట్టబెట్టాడు టీమిండియాకు. అనూహ్యంగా ఇక తన సేవలు అవసరం లేదని అనుకున్నాడో ఏమో తప్పుకుంటున్నానంటూ ప్రకటించాడు. క్రికెట్ లోకాన్ని విస్తు పోయేలా చేశాడు.
ముందు నుంచీ విరాట్ కోహ్లీ వెరీ డిఫరెంట్. ఆత్మ విశ్వాసం ఎక్కువ. అతడికి ఉన్నంత బ్రాండ్ వాల్యూ ఇంకే క్రికెటర్ కు లేదంటే నమ్మలేం. అంతెందుకు ప్రపంచ మార్కెట్ లో కూడా దిగ్గజ ఆటగాళ్ల సరసన ఉన్నాడు.
ఎక్కడా గర్వం అన్నది ఉండదు. కానీ మైదానంలోకి వచ్చే సరికల్లా తన అటిట్యూడ్ మారిపోతుంది. అదంతే గ్రౌండ్ లోకి వచ్చాడంటే సీరియస్ గా ఉంటాడు. కానీ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ఆట తీరు ఉంటుంది.
నాయకుడు అన్నాక పది మందికి ఆదర్శంగా ఉండాలి. తను ఆడాలి ఇతరులను ఆడేలా చేయాలి. లేదంటే సాధించిన విజయాలు వెనక్కి వెళ్లి పోతాయి. గెలుపుల్ని త్వరగా మరిచి పోతారు ఈ అభిమానులు.
రికార్డులు కొద్ది సేపే మళ్లీ మళ్లీ ఊరిస్తూ ఉంటాయి. ఇంకొకరు వస్తారు. వాటిని ఛేజ్ చేస్తారు. ఆట అన్నాక సర్వ సాధారణం. కోహ్లీది(Kohli Dravid )దూకుడు స్వభావం. అచ్చం బీసీసీఐ దాదా లాగానే. తనపై ఇంకొకరి పెత్తనాన్ని సహించడు.
అందుకేనేమో మీరు తీసే కంటే ముందే తాను తప్పుకుంటున్నానని ప్రకటించాడు. తెగే దాకా లాగొద్దన్నది కోహ్లీ ఆలోచన. హుందాగా వచ్చాడు అంతే గౌరవంగా వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాడు.
Also Read : కోహ్లీ నిర్ణయం రోహిత్ విస్మయం