Virat Kohli Pushpa : పుష్ప మేనియా కోహ్లీ వారెవా

త‌గ్గేదే లేదంటున్న స్టార్ ప్లేయ‌ర్

Virat Kohli Pushpa : ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసి రిలీజ్ చేశాడో కానీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప దుమ్ము రేపుతోంది. గ‌త డిసెంబ‌ర్ 17న ప్రంప‌చ వ్యాప్తంగా 3 వేల థియేట‌ర్ల‌లో విడుద‌లై బాక్సాఫీసు బ‌ద్ద‌లు కొట్టింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మంద‌న్నా, స్పెష‌ల్ సాంగ్ తో స‌మంత క‌లిసి న‌టించిన ఈ మూవీ రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సాంగ్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా మెస్మ‌రైజ్ చేస్తున్నాయి.

కుల‌, మతం, ప్రాంతం, జాతి అన్న‌ది లేకుండా లోక‌మంతా సామి సామి, ఊ అంటామా, శ్రీ‌వ‌ల్లి , ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ పాడుకుంటున్నారు. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి.

ఇక శ్రీ‌వ‌ల్లి పాట ఇప్పుడు ఓ ఐకాన్ గా మారింది. ప్ర‌త్యేకించి తెలుగు సినిమాల‌న్నా, పాట‌ల‌న్నీ తెగ ఇష్ట‌ప‌డే క్రికెట‌ర్ల‌లో మొద‌టి వ్య‌క్తి ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నార్.

తెలుగు వాళ్లంతా అత‌డిని వార్న‌ర్ భ‌య్యా అని పిలుస్తారు. మ‌నోడు ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే వ‌ర‌ల్డ్ వైడ్ గా పుష్ప మూవీకి, సాంగ్స్ కు, డైలాగ్ ల‌కు ప‌బ్లిసిటీ తెచ్చి పెట్టాడు.

నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే శ్రీ‌వ‌ల్లి సాంగ్ కు శిఖ‌ర్ ధావ‌న్ , వార్న‌ర్, ర‌షీద్ ఖాన్ స్టెప్పులతో అల‌రించారు. తాజాగా వీరి లిస్టులో కూడా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Pushpa) చేరి పోయాడు.

విండీస్ తో జ‌రిగిన వ‌న్డేలో విజ‌యం సాధించాక శ్రీ‌వ‌ల్లి స్టెప్పుతో అల‌రించాడు. ఇప్పుడు అది హ‌ల్ చ‌ల్ అవుతోంది.

Also Read : శిఖ‌ర్ ధావ‌న్ సేవ‌లు అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!