Virat Kohli : భారత జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో అరుదైన ఘనతను సాధించాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఇక కోహ్లీ తన కెరీర్ లో ఈ మైదానంలో 100వ టెస్టు ఆడుతున్నాడు. వంద టెస్టులు ఆడిన ఆటగాళ్లలో కోహ్లీ 12వ ఆటగాడు. కోహ్లీ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా కానీ 47 పరుగుల వద్ద అవుటయ్యాడు.
ఇక విరాట్ (Virat Kohli)మరో మైలు రాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్ లో 8 వేల పరుగులు చేసిన ఆరో భారత బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో టీమిండియా తరపున సచిన్ , రాహుల్ ద్రవిడ్ , గవాస్కర్ , లక్ష్మణ్ , సెహ్వాగ్ లు ఈ ఘనతను సాధించారు.
ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ తన కెరీర్ మొత్తంలో 169 ఇన్నింగ్స్ లలో 8 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. కాగా 154 ఇన్నింగ్స్ లలో సచిన్ అందరికంటే ముందంజలో ఉన్నాడు.
భారత జట్టుకు ఏడు ఏళ్లకు పైగా సారథ్యం వహించాడు. అతడి సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. కానీ అనుకోని రీతిలో స్కిప్పర్ పదవికి రాజీనామా చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులు కలిగిన ఆటగాడిగా పేరుంది విరాట్ కోహ్లీకి.
అత్యంత దూకుడును ప్రదర్శిస్తూ భారత జట్టుకు అజహరుద్దీన్ తర్వాత అంతటి పేరు తీసుకు వచ్చిన ఘనత ఈ స్టార్ ప్లేయర్ కే దక్కుతుంది.
Also Read : కోహ్లీ మెరిసేనా సెంచరీ సాధించేనా