Rohit Sharma :భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంపై సర్వత్రా విస్తు పోయేలా చేసింది. తాజా, మాజీ దిగ్గజ ఆటగాళ్లంతా కోహ్లీ ఈ సమయంలో తప్పుకునేది లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొందరు సానుకూలంగా స్పందిస్తే మరికొందరు కోహ్లీ సరైన నిర్ణయం తీసుకున్నాడంటూ స్వాగతిస్తున్నారు. ఈ తరుణంలో కొన్నేళ్ల పాటు కలిసి ఆడుతున్న మరో క్రికెటర్ ప్రస్తుత టీ20, వన్డే స్కిప్పర్ గా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma) విరాట్ తప్పుకోవడంపై స్పందించాడు.
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి ఇంత త్వరగా నిష్క్రమిస్తాడని అనుకోలేదని పేర్కొన్నాడు. గాడి తప్పిన టీమిండియాను అత్యంత శక్తివంతమైన జట్టుగా మార్చిన ఘనత కోహ్లిదేనంటూ కితాబు ఇచ్చాడు రోహిత్ శర్మ(Rohit Sharma).
ఈ కాలపు క్రికెట్ ప్రస్థానంలో అద్భుతమైన ఆటగాళ్లలో విరాట్ ఒకడని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఏ ఫార్మాట్ లోనైనా అవలీలగా పరుగులు సాధించే అతి కొద్దిమంది ప్లేయర్లలో తను కూడా ఉంటాడని స్పష్టం చేశాడు.
వ్యక్తిగతంగా తాను కోహ్లీని, ఆయన వ్యక్తిత్వాన్ని అమితంగా ఇష్టపడతానని తెలిపాడు రోహిత్ శర్మ. ఏ సమయంలోనూ ఓటమిని ఒప్పుకోని అరుదైన మనస్తత్వం కోహ్లీదని ఇలాంటి ఆటగాళ్లు కొద్దిమందే ఉంటారని అన్నాడు.
భవిష్యత్తులో ఆటగాడిగా భారత జట్టుకు సేవలు అందిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. ఈ క్లిష్ట సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒకింత విస్తు పోయేలా చేసిందన్నాడు.
మొత్తంగా కోహ్లీ లాంటి ఆటగాడు భారత జట్టుకు ఆడడం లక్ అని చెప్పక తప్పదు.
Also Read : భారత టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై