Virat Kohli Jaiswal : యశస్వి జైస్వాల్ కు కోహ్లీ పాఠాలు
విమర్శలు పట్టించుకోకు ఆటపై ఫోకస్ పెట్టు
ఐపీఎల్ 16వ సీజన్ లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరు పొందాడు విరాట్ కోహ్లీ. పరుగుల వరద పారించే ఈ క్రికెటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను కూడా ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఈసారి ఐపీఎల్ లో టాప్ స్కోరర్ ల జాబితాలో తను కూడా ఉన్నాడు .
తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరగులకు ఆలౌటైంది. 112 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగుల బ్యాటర్ల జాబితాలో నెంబర్ వన్ గా ఉన్నాడు రాజస్థాన్ యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్. కానీ ఈ మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తో జైస్వాల్ బేటీ అయ్యాడు. ఈ సందర్భంగా కీలకమైన సూచనలు ఇచ్చాడు యంగ్ క్రికెటర్ కి. విమర్శల గురించి పట్టించు కోవద్దని నీకు నచ్చిన రీతిలో ఆడుతూ వెళ్లు అని సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ, జైస్వాల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.