Babar Azam : కోహ్లీ ఆట తీరు అద్భుతం – బాబ‌ర్ ఆజం

పాకిస్తాన్ బ్యాట‌ర్లు చూసి నేర్చుకోవాలి

Babar Azam : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన సూప‌ర్ 12 కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సంద‌ర్భంగా మ్యాచ్ అనంత‌రం పాకిస్తాన్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజం(Babar Azam) మీడియాతో మాట్లాడాడు. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఆట తీరును ప్ర‌శంసించాడు.

రియ‌ల్ ఛాంపియ‌న్ గా ఆడాడ‌ని కితాబు ఇచ్చారు. విరాట్ క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడ‌ని, పాకిస్తాన్ బ్యాట‌ర్లు చూసి ఎలా ఆడాలో చూసి నేర్చు కోవాల‌ని కోరాడు. ఈ క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీకి దక్కుతుంద‌న్నాడు. ప్ర‌ధానంగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా ఒత్తిడి అన్న‌ది ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఒత్తిళ్ల మ‌ధ్య ఎలా ఆడాలో కోహ్లీకి(Virat Kohli) తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌ద‌ని పేర్కొన్నాడు. టాప్ ఆర్డ‌ర్ వికెట్లు కూలుతున్నా ఎక్క‌డా త‌ల వంచ లేదు. కంటిన్యూగా ప‌రుగులు చేస్తూ పోయాడ‌ని ప్ర‌శంసించాడు బాబ‌ర్ ఆజం. గ‌త కొంత కాలంగా కోహ్లీ ఆడ‌డంలో ఇబ్బందులు ప‌డ్డాడ‌ని, కానీ ఈ మ్యాచ్ లో అత‌డు ఆడిన తీరు అద్భుత‌మ‌ని పేర్కొన్నాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే వ్య‌క్తిగ‌తంగా మ‌రింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై యావత్ క్రికెట్ ప్ర‌పంచం ప్రశంస‌ల‌తో ముంచెత్తుతోంది.

త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న తీరు అద్భుత‌మ‌ని పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో 53 బంతులు ఆడిన కోహ్లీ 82 ర‌న్స్ చేశాడు. యావ‌త్ భార‌తం ఈ విజ‌యంతో మ‌రోసారి స‌త్తా చాటింది.

Also Read : పాకిస్తాన్ పై భార‌త్ థ్రిల్లింగ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!