Kolkata Knight Riders 2022 : ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ కు దుబాయి వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ పీడకలగా మిగిలింది. చివరి దాకా వచ్చి సీఎస్కేతో ఫైనల్ లో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది.
ఆఖరుకు రన్నరప్ గా నిలిచింది. ధోనీ వ్యూహాలకు చిత్తైంది కేకేఆర్. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్దం అవుతోంది.
ప్రస్తుతం అందరి కళ్లు కేకేఆర్(Kolkata Knight Riders 2022) పై ఉన్నాయి.
గత నెల ఫిబ్రవరి 12, 13 లలో బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది కేకేఆర్ స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను.
ప్రస్తుతం కేకేఆర్ జట్టు ఫ్రాంచైజీ ఇయాన్ ను తప్పించి అయ్యర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఇక ఈ జట్టుకు రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ , మెహతా గ్రూప్ కలిసి ఓనర్లుగా ఉన్నాయి.
రెడ్ చిల్లీస్ కు 55 శాతం వాటా ఉండగా మెహతా గ్రూప్ కు 45 శాతం వాటా ఉంది. 2008 జనవరి 24న ఏర్పాటు చేశారు కోల్ కతా నైట్ రైడర్స్ ను.
షారుఖ్ ఖాన్ దీని వెనుక ఉన్నారు. ఈ జట్టు పశ్చిమ బెంగాల్ కేపిటల్ సిటీ కోల్ కతా వేదికగా ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఇప్పటి వరకు కేకేఆర్ మొత్తం ఐపీఎల్ 14 సీజన్లు కొనసాగగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు(Kolkata Knight Riders 2022) రెండు సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుపొందింది.
2012 లో 2014 సంవత్సరాలలో జరిగిన ఐపీఎల్ కప్ చేజిక్కించుకుంది. ఈ ఓనర్లలో షారుఖ్ ఖాన్ తో పాటు జుహీ చావ్లా, జీ మెహతా ఉన్నారు.
2011లో ఐపీఎల్ కు అర్హత సాధించింది.
2012లో సీఎస్కేను ఓడించి టైటిల్ తీసుకుంది. 2014లో పంజాబ్ కింగ్స్ ను ఓడంచి సత్తా చాటింది కేకేఆర్. టీ20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
ఇక జట్టు పరంగా చూస్తే బ్యాటర్లు అలెక్స్ హేల్స్ , శ్రేయస్ అయ్యర్, రహానే, నితీష్ రాణా, అమన్ హకీమ్ ఖాన్ , రింకూ సింగ్ , తోమర్ , ప్రథమ్ సింగ్ , బాబా ఇంద్రజిత్ ఉన్నారు.
వికెట్ కీపర్లుగా సామ్ బిల్లింగ్స్ , షెల్డన్ జాక్స్ ఆడతారు. ఆల్ రౌండర్లుగా ఆండ్రీ రస్సెల్ , సునీల్ సరైన్, వెంకటేశ్ అయ్యర్, నబీ, అనుకుల్ రాయ్ ఉన్నారు.
ఇక బౌలర్ల పరంగా చూస్తే పాట్ కమిన్స్ , టిమ్ సౌథి, వరుణ్ చక్రవర్తి, చమికా కరుణ రత్నే, ఉమేష్ యాదవ్ , రసిఖ్ సలామ్ , శివమ్ మావి ఆడనున్నారు.
Also Read : ఈసారైనా పంజాబ్ కింగ్స్ మెరిసేనా