Komati Reddy Brothers : అన్నదమ్ముల హవా
కోమటిరెడ్డి బద్రర్స్
Komati Reddy Brothers : నల్లగొండ జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా చెప్పినట్టుగానే పూర్తి మెజారిటీ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక సీఎం రేసులో ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తో పాటు తన సోదరుడు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Komati Reddy Brothers Viral
ఒక రకంగా వారు విజయం సాధించినట్టేనని చెప్పక తప్పదు. ఇక అన్నీ తానై వ్యవహరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను బరిలో ఉన్న కోడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతుండడం విస్తు పోయేలా చేసింది.
ప్రస్తుతం 119 నియోజకవర్గాలకు గాను 70కి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ 30కి పైగా సీట్లలో లీడ్ లో ఉండగా భారతీయ జనతా పార్టీ 9 సీట్లలో ఎంఐఎం 4 సీట్లలో సీపీఐ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య , మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, యశస్విని రెడ్డి , దాసరి సీతక్క , వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్ లీడ్ లో కొనసాగుతుండడం విశేషం.
Also Read : Srikantha Chary : శ్రీకాంతా చారికి రేవంత్ రెడ్డి నివాళి