Komatireddy Rajgopal Reddy : కేసీఆర్ మాట‌ల‌న్నీ అబ‌ద్దాలే

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆగ్ర‌హం

Komatireddy Rajgopal Reddy : ఎందు కోసం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌వో చెప్పాలంటూ కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిని ప్ర‌శ్నించారు శ‌నివారం మునుగోడులో జ‌రిగిన ప్ర‌జా దీవెన స‌భా సాక్షిగా.

ఈ సంద‌ర్భంగా సీఎం చేసిన కామెంట్స్ పై సీరియ‌స్ గా స్పందించారు రాజ గోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy). ఈరోజు వ‌ర‌కు త‌న‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌మ‌ని కోరితే ఇవ్వ‌లేద‌న్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్రంలో ఏక‌ప‌క్ష‌, ఏక స్వామ్య‌, రాచ‌రిక పాల‌న సాగుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విచిత్రం ఏమిటంటే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను గౌరవించ‌డం కానీ లేదా నిధులు మంజూరు చేయ‌డం కానీ ఈనాటి వ‌ర‌కు చేసిన పాపాన పోలేద‌ని ఆరోపించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృద్ది చోటు చేసుకోలేద‌న్నారు. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్ దిగి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఈ ఒక్క ఉప ఎన్నిక‌పై దేశ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోంద‌న్నారు తాజా , మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ ఆత్మ గౌర‌వం కోస‌మే ఈ ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

అధికార ప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేల‌కే దిక్కు లేదు. క‌లిసేందుకు ఆయ‌నకు టైం లేదు. ఇక ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను ఎప్పుడు క‌లుస్తాడంటూ ప్ర‌శ్నించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

కేసీఆర్ అహంకారం వ‌ల్లే ఈ ఉప ఎన్నిక రాబోతోంద‌న్నారు. రాబోయే ఈ ఎన్నిక‌లు క‌ల్వ‌కుంట్ల అహంకారానికి ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాట‌మ‌న్నారు కోమ‌టిరెడ్డి.

సీఎం మాట‌లు నీటి మూట‌లు, అస‌త్యాల‌ని పేర్కొన్నారు.

Also Read : మోదీ అహంకారం దించ‌డం ఖాయం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!