Krishna Funeral : మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు
అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశం
Krishna Funeral : తెలుగు సినిమా రంగం తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామ కృష్ణ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు 80 ఏళ్లు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరు పొందారు. 350కి పైగా సినిమాలు తీశారు. ఎంతో మందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చారు.
పద్మాలయ స్టూడియో ద్వారా ఎన్నో సినిమాలు తీశారు. తెలుగు సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన నట శేఖరుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సహచరుడిని కోల్పోయానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు, నటీనటులు, టెక్నిషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో ఆయన భౌతిక కాయానికి చివరి సారి వీడ్కోలు పలికేందుకు గాను ఇవాళ అంత్యక్రియలు చేయడం లేదు.
ఈనెల 17న మహాప్రస్థానంలో అంత్యక్రియలు(Krishna Funeral) చేపట్టనున్నారు. ప్రస్తుతం గచ్చి బౌలిలో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. హీరో సూర్య సంతాపం ప్రకటించారు. నీకు తోడున్నామంటూ తెలిపారు. కృష్ణ మృతిపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన నిజమైన లెజెండ్ అని కొనియాడారు మంత్రి కేటీఆర్. విషాదంలో మునిగి పోయానని అన్నారు రాధికా శరత్ కుమార్. నటులు ప్రగ్యా జైస్వాల్ , రవితేజ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని పేర్కొన్నారు చిరంజీవి, రజనీకాంత్. కృష్ణ లేరంటే తట్టుకోలేక పోతున్నానని వాపోయారు. నటి వాణిశ్రీ.
తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. సాహసానికి మరో పేరు అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
Also Read : సూపర్ స్టార్ చెరగని నవ్వుకు ప్రతిరూపం