Krishna Passes Away : సూప‌ర్ స్టార్ కృష్ణ ఇక లేరు

దివికేగిని న‌ట శేఖ‌రుడు

Krishna Passes Away : తెలుగు సినిమాలో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ న‌టుడు సూప‌ర్ స్టార్ గా పేరొందిన న‌ట శేఖ‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ క‌న్ను మూశారు. ఆయ‌న‌కు 80 ఏళ్లు. మంగ‌ళ‌వారం ఉద‌యం 4.10 గంట‌ల‌కు హైద‌రాబాద్ లోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు.

సోమ‌వారం అర్ధ‌రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో బాధ ప‌డుతున్న కృష్ణ‌ను హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న‌కు గుండె పోటు వ‌చ్చింద‌ని వైద్యులు వెల్ల‌డించారు. 48 గంట‌లు ఆగితే త‌ప్పా ఏమీ చెప్ప‌లేమ‌ని తెలిపారు. అంద‌రినీ శోక సంద్రంలో ముంచేసి త‌ర‌లి రాని తీరాల‌కు వెళ్లి పోయారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌(Krishna Passes Away).

గుంటూరు జిల్లా తెనాలి మండ‌లంలోని బుర్రిపాలెంలో 1942 మే 31న పుట్టారు. న‌టుడిగా తెలుగు సినిమా రంగంపై త‌న‌దైన ముద్ర వేశారు. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ప‌ద్మాల‌య స్టూడియో అధినేత‌గా ఉన్నారు. ఎంపీగా కూడా ప‌ని చేశారు. ఆయ‌న‌కు భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త‌మైన ప‌ద్మ‌భూష‌ణ్ తో స‌త్క‌రించింది. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగారు.

కృష్ణ‌కు ఇద్ద‌రు భార్య‌లు. ఇందిరాదేవి, విజ‌య నిర్మ‌ల‌. ఇద్ద‌రూ క‌న్ను మూశారు. న‌టుడు ర‌మేష్ బాబు , న‌రేశ్ , మ‌హేష్ బాబు, మంజుల, ప్రియ‌ద‌ర్శిని కృష్ణ పిల్ల‌లు. 1970, 1980ల్లో తెలుగు సినిమా హీరోగా అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందారు.

ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కృష్ణ , కృష్ణంరాజు మ‌ధ్య పోటీ ఉండేది ఆనాడు. కృష్ణ పూర్తి పేరు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌మూర్తి. కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా ఒక్క‌సారిగా విషాదంలో కూరుకు పోయింది.

Also Read : శోక సంద్రం దివికేగిన న‌ట దిగ్గ‌జం

Leave A Reply

Your Email Id will not be published!