Krishna Yadav : అంబ‌ర్ పేటపై ‘బాద్ షా’ ఫోక‌స్

పిలిస్తే ప‌లికే అన్న కృష్ణ‌న్న

Krishna Yadav : ఎవ‌రీ బాద్ షా అనుకుంటున్నారా. ఏ స‌మ‌యంలోనైనా పిలిస్తే ప‌లికే నేత‌గా, ప్ర‌జాభిమానం క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందిన చెన్న‌బోయ‌న్న కృష్ణా యాద‌వ్. ఆయ‌న‌కు లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. ఎవ‌రైనా స‌రే ఆప‌దలో ఉన్నారంటే కృష్ణ‌న్న‌ వ‌ద్ద‌కు వెళితే సాయం అందుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి యాద‌వ కుటుంబంలో పుట్టిన కృష్ణా యాద‌వ్ కు ప్ర‌జ‌లంటే అభిమానం. అందుకే త‌న‌ను లీడ‌ర్ ను చేసింది. చ‌దువుకునే స‌మ‌యంలోనే విద్యార్థి నాయ‌కుడిగా పేరు పొందారు. ఆ త‌ర్వాత చ‌దువుకుంటూనే రాజ‌కీయాల‌లోకి రావాల‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని, ఇందుకు పాలిటిక్స్ స‌రైన‌వంటూ న‌మ్మారు.

Krishna Yadav Comment Viral

కార్పొరేట్ గా గెలుపొందారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ న‌డిబొడ్డున కీల‌క ప్రాంతంగా పేరు పొందిన హిమాయ‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ(TDP) హ‌యాంలో కేబినెట్ లో కొలువు తీరారు. అనూహ్యంగా ఇబ్బందుల్లో ప‌డ్డారు. కానీ ఎక్క‌డా త‌ల వంచ లేదు. తాను చేసిన సాయం త‌న‌ను జ‌న నాయ‌కుడిగా తీర్చేలా చేస్తుంద‌ని న‌మ్మారు. ఆ దిశ‌గా ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా, ఎంద‌రు ఆరోప‌ణ‌లు చేసినా, ఇంకొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించినా దెబ్బ తిన్న పులిలా బ‌య‌ట‌కు వ‌చ్చారు కృష్ణ యాద‌వ్.
ప్ర‌త్య‌ర్థులు ఆయ‌నకు ఉన్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక పోయారు. రాజ‌కీయంగా, ఆర్థికంగా, మాన‌సికంగా, సామాజిక ప‌రంగా అణ‌దొక్కేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎక్క‌డా త‌ల వంచ లేదు. ధిక్కార స్వ‌రం వినిపించారు.

ఎక్క‌డ తన‌ను తొక్కాల‌ని చూశారో అక్క‌డే జెండా ఎగ‌రేలా చేశాడు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల యుద్దం మొదలైంది. త‌న అభిమానులు ఆయ‌న‌ను బాద్ షా అని పిలుచుకుంటారు. ఎవ‌రికైనా అన్యాయం జ‌రిగితే స‌హించ‌ని మ‌న‌స్త‌త్వం కృష్ణా యాద‌వ్ ది. మ‌రోసారి తానేమిటో చూపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఎలాగైనా స‌రే అంబ‌ర్ పేట కైవ‌సం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు హైద‌రాబాద్ అంతా ఒక ఎత్తు అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇంకో ఎత్తు. ఇక్క‌డ కృష్ణా యాద‌వ్ జెండా పాతాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి బాద్ షా డిసైడ్ అయితే వార్ వ‌న్ సైడ్ అవుతుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : Telangana Election Commission : ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!