Krunal Pandya : లక్నో వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ముంబై ఇండియన్స్ పై 5 రన్స్ తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ముంబైకి చుక్కలు చూపించింది లక్నో.
ఆఖరులో వచ్చిన లక్నో బౌలర్ మోహిసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది ఎవరో కాదు మోస్ట్ హిట్టర్ గా పేరు పొందిన టిమ్ డేవిడ్ . అప్పటికే 32 రన్స్ చేసి ఉన్నాడు. కానీ తన ముంబై ఇండియన్స్ జట్టును గగెలిపించ లేక పోయాడు.
ఇదిలా ఉండగా ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది లక్నో . ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 49 రన్స్ తో అనూహ్యంగా రిటైర్ హర్ట్ అయ్యాడు కృనాల్ పాండ్యా.
అయితే రిటైర్ట్ హర్ట్ అయ్యాడా లేక రిటైర్డ్ హర్ట్ గా ఔట్ అయ్యాడా అన్నది గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కృనాల్ పాండ్యా స్పందించాడు. తనకు గాయం కారణంగానే పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చిందని, తాను ఔట్ కాలేదని రిటైర్ హర్ట్ అయ్యానని చెప్పాడు.
Also Read : PBKS vs DC IPL 2023