Virat Kohli Viral : విరాట్ కోహ్లీ హ‌ల్ చ‌ల్

నెట్టింట్లో వైర‌ల్

Virat Kohli Viral : ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎక్క‌డా ఎప్పుడూ ఓట‌మి అంటూ ఒప్పుకోడు. మైదానంలోకి వ‌చ్చాడంటే పులిలా మారి పోతాడు. నిత్యం త‌న జ‌ట్టు స‌భ్యుల‌ను ప్రోత్స‌హిస్తూ ఉంటాడు. చిరుత‌లా మైదానంలో క‌దులుతూ ఉంటాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ఒక్కోసారి చిరాకు తెప్పించేలా చేస్తాడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న అలాగే ఉంటుంది.

కానీ త‌మ జ‌ట్టుకు మాత్రం విరాట్ కోహ్లీ ఓ సూప‌ర్ ఐకానిక్ హీరో. కొత్త వారిని ప్రోత్స‌హిస్తాడు. ఒక్కోసారి ఫెయిల్ అయినా స‌రే వారికి అండ‌గా ఉంటాడు కోహ్లీ. ఇది అత‌డి ప్ర‌త్యేక‌త‌. గ‌త కొంత కాలంగా చాలా మంది ప్లేయ‌ర్ల‌కు విరాట్ స‌పోర్ట్ గా నిలిచాడు. అందులో హైద‌రాబాదీ స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్. ఇవాళ భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన బౌల‌ర్ గా రాణిస్తున్నాడు.

ఇక తాజాగా విరాట్ కోహ్లీ(Virat Kohli Viral)  వైర‌ల్ గా మారాడు. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ గా మారాడు. ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో ఆర్సీబీ 18 ప‌ర‌గుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 126 ర‌న్స్ చేస్తే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 108 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. క‌ర్ణ్ శ‌ర్మ‌, జోష్ హేజిల్ వుడ్ సూప‌ర్ స్పెల్ కు విల విల లాడారు ల‌క్నో బ్యాట‌ర్లు.

ఇక కేఎల్ రాహుల్ గాయం కార‌ణంగా త‌ప్పు కోవ‌డంతో స్లాండ్ ఇన్ కెప్టెన్ గా కృనాల్ పాండ్యా నిర్వ‌హించాడు. ఈ సమ‌యంలో విరాట్ కోహ్లీ తెగ ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Also Read : కోహ్లీ కిస్ అనుష్క జోష్

Leave A Reply

Your Email Id will not be published!