KS Eshwarappa : రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేదు – ఈశ్వ‌ర‌ప్ప‌

కాంట్రాక్ట‌ర్ సూసైడ్ నోట్ క‌ల‌క‌లం 

KS Eshwarappa : త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన కాంట్రాక్ట‌ర్ వ్య‌వ‌హారం క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘట‌న‌కు సంబంధించి మంత్రి ఈశ్వ‌ర‌ప్ప(KS Eshwarappa) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న చావుకు మంత్రి కార‌ణ‌మ‌ని, త‌న ఆకాంక్ష‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాన‌ని , ప్ర‌ధాని, సీఎం, ప్రియ‌త‌మ లింగాయ‌త్ నేత బీఎస్ వై తో పాటు త‌న‌కు ఆప‌న్న హ‌స్తం అందించాల‌ని కోరాడు బాధితుడు.

ఇదిలా ఉండ‌గా సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, మంత్రి కేఎస్ ఈశ్వ‌రప్ప‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ మంగ‌ళ‌వారం ఉడిపి ఓల‌ని ఓ హోట‌ల్ లో శ‌వ‌మై క‌నిపించాడు.

మంత్రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం, కాంట్రాక్ట‌ర్ మృతి చెంద‌డం రాష్ట్రంలో క‌ల‌కలం రేగింది. తాను చేసే సివిల్ ప‌నుల‌కు సంబంధించి బిల్లులు క్లియ‌ర్ చేసేందుకు క‌మీష‌న్ ఇవ్వాల‌ని మంత్రి, ఆయ‌న స‌హ‌చ‌రులు వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ క‌ర్ణాట‌క రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఈశ్వ‌ర‌ప్ప‌పై సంతోష్ ప్ర‌ధానికి లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి ఈశ్వ‌ర‌ప్ప‌(KS Eshwarappa). సంతోష్ పాటిల్ పై తాను వేసిన కేసులో కోర్టు తీర్పు కోసం వేచి చూడాల్సిందేన‌ని పేర్కొన్నారు.

తాను ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌. దీనిపై సీఎం ఇంకా స్పందించ లేదు.

Also Read : ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప‌చ్చ జెండా

Leave A Reply

Your Email Id will not be published!