KS Eshwarappa : ఆరు నూరైనా రాజీనామా చేయ‌ను

స్ప‌ష్టం చేసిన మంత్రి ఈశ్వ‌ర‌ప్ప

KS Eshwarappa : కాంట్రాక్ట‌ర్ సూసైడ్ కేసులో త‌న పేరు చేర్చ‌డంపై క‌ర్ణాట‌క రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆరు నూరైనా తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. రూ. 4 కోట్ల ప‌నుల‌కు సంబంధించి మంత్రితో పాటు ఆయ‌న అనుచ‌రులు 40 శాతం క‌మీష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారంటూ కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ మంగ‌ళ‌వారం ఓ హోట‌ల్ లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా నోట్ రాశాడు. ఈ నోట్ లో త‌న సూసైడ్ కు ప్ర‌ధాన కార‌ణం రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌తో(KS Eshwarappa) పాటు మ‌రో ఇద్ద‌రు అనుచ‌రులు ఉన్నారంటూ పేర్కొన్నారు.

ఇవాళ సంతోష్ పాటిల్ త‌మ్ముడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంత్రి , అనుచ‌రుల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ కాంట్రాక్ట‌ర్ సూసైడ్ వ్య‌వ‌హారం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది.

త‌న మ‌ర‌ణానికి మంత్రే కార‌ణ‌మంటూ వాట్సాప్ లో సంతోష్ పాటిల్ త‌న స్నేహితుల‌కు మెస్సేజ్ పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంత్రి త‌న‌ను ఆత్మ‌హ‌త్య‌కు పురి కొల్పారంటూ ఆరోపించారు.

మంత్రితో పాటు అనుచ‌రులు బ‌స‌వ‌రాజ్ , ర‌మేష్ ల‌పై ఎఫ్ఐఆర్ లో కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప(KS Eshwarappa) బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

సంతోష్ పాటిల్ త‌న ప‌నికి రూల్స్ లేకుండా డ‌బ్బులు చెల్లించాల‌ని కోరుతున్నారు. తాను ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నానంటూ ప్ర‌శ్నించారు.

వ‌ర్క్ ఆర్డ‌ర్ అంటూ లేకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారంటూ నిల‌దీశారు. వాట్సాప్ సందేశాన్ని డెత్ నోట్ గా ఎలా ప‌రిగ‌ణిస్తార‌ని , దానిని ఎవ‌రైనా టైప్ చేయ‌వచ్చు అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేదు – ఈశ్వ‌ర‌ప్ప‌

Leave A Reply

Your Email Id will not be published!